చలాన్ల వసూళ్లలో రికార్డులు

Traffic challan
x
Traffic challan
Highlights

చేతుల్లో డిజిటల్ కెమెరాలు, సిటీ రోడ్లపై హై డెఫినిషన్ సీసీ కెమెరాలు. ఒక్క క్లిక్ చేస్తే చాలు వందకు తగ్గకుండా ఫైన్. దీనికి తోడు సర్విస్ ఛార్జీల పేరుతో మరో 35 రూపాయలు అదనం. ఇదీ సిటీ రోడ్లపై MV యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామంటున్న మన ట్రాఫిక్ పోలీసుల పనితీరు.

చేతుల్లో డిజిటల్ కెమెరాలు, సిటీ రోడ్లపై హై డెఫినిషన్ సీసీ కెమెరాలు. ఒక్క క్లిక్ చేస్తే చాలు వందకు తగ్గకుండా ఫైన్. దీనికి తోడు సర్విస్ ఛార్జీల పేరుతో మరో 35 రూపాయలు అదనం. ఇదీ సిటీ రోడ్లపై MV యాక్ట్ ను పక్కాగా అమలు చేస్తున్నామంటున్న మన ట్రాఫిక్ పోలీసుల పనితీరు. ఓ వైపు రూల్స్ బ్రేక్ చేస్తున్న వాహనదారులు మరోవైపు ఛలానాల వేటలో పోలీసులు దీంతో ఒకటి కాదు రెండు కాదు ప్రతీ ఏటా వందల కోట్ల టార్గెట్‌తో గల్లాపెట్టే నిండుతోంది. 2018 ఒక్క ఏడాది లోనే 146 కోట్లు చలాన్ లు ద్వారా వసూలు చేశారు పోలీసులు.

భాగ్య నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు కొత్త విధానాలను ప్రవేశపెడ్తున్నారు. అయితే ఎన్ని ప్రయోగాలు చేసినా ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. దీంతో కొంతకాలంగా జంక్షన్ల దగ్గర అత్యాధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈ కెమెరాల సాయంతో నిబంధనలు పాటించని వారికి ఫైన్లు విధిస్తున్నారు. అయితే వీటిని కొంత మంది చెల్లిస్తున్నారు మరి కొంత చలాన్ లు కట్టకుండ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారిపై నిఘా ఉంచి వారిని కటకటాల్లోకి నెట్టేందుకు పోలీసులు నిర్ణయించారు. ట్రాఫిక్ నిబందనలపై ఎన్ని సార్లు అవగాహన కల్గిస్తున్నా వాహనదారులులో మార్పు రావడం లేదని పోలీస్ ఉన్నతాధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత ఏడాది లోనే సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్ మెంట్ కింద 25,95,772 చలాన్లు ను విధించారుచలాన్ ద్వారా 91 కోట్ల 91 లక్షలు రూపాయలు వచ్చింది. 14782 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కాగ అందులో 4203 మందిని జైలు కి పంపించారు పోలీసులు. పట్టుబడిన వారికి న్యాయ స్థానం 16 కోట్ల 65 లక్షల జరిమానా విధించినట్లు లెక్కలు చెపుతున్నాయి. ఇక హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన ట్రాఫిక్ ఉల్లంఘనల కేసుల్లో వంద కోట్లకు పైగా చలానాలను విధించారు. ఇక ట్రాఫిక్ విభాగం ఇయర్ ఎండింగ్ రిపోర్ట్ చుస్తే నిబందనలు ఉల్లగించిన వారిపై 29484 కేసులు నమోదు కాగ 27,387మంది పై చార్జ్ షీట్ లు దాఖలు చేశారు అధికారులు, అందులో 191 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు ఇక వీరిని కోర్ట్ లో హాజరు పరచగా 5441 మందికి ఒక్క రోజు నుండి మూడు నెలలు వరకు జైలు శిక్ష విధించింది నాంపల్లి మెట్రో పాలిటాన్ మేజిస్ట్రేట్ కోర్ట్. ఇక 1424 మంది డ్రైవింగ్ లైసన్స్ లను రద్దు చేసింది. ఇందులో 189 మందివి పూర్తిగా డ్రైవింగ్ లైసన్స్ రద్దు చేయగా , 1235 డ్రైవింగ్ లైసన్స్ లు మూడు నెలలు నుండి 10 సంవత్సరాలు వరకు రద్దు చేసింది. మొత్తం 2018 లో 5,88,99,500 జరిమానాలను కోర్ట్ విధించింది . ఇక మొత్తం వచ్చిన ఆదాయం మాత్రం 24.79 కోట్ల వసూలు అయినట్లు రిపోర్ట్ చెపుతుంది ఐతే వాహనదారులకు ఛలానాలు విధించడం కంటే ట్రాఫిక్ రూల్స్ పాటించే విధంగా చేయడమే తమ లక్ష్యం అంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు.

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం11,60,937 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 15.61 కోట్లు జరిమానాలను వసూలు చేశారు పోలీసులు వీటిలో 5,692 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 897 మంది వాహనదారులకు కోర్టులు శిక్ష విధించాయని అన్నారు. ఇందులో 93.45లక్షల జరిమానాలను వసూలు చేశామని తెలిపారు. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్‌చేసిన నేరంలో 5660, సిగ్నల్ జంప్ కింద 11423 కేసులు నమోదు చేశామని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిని ఫొటో తీసేందుకు ఆటోమేటిక్‌గా క్యాప్చర్ చేసే కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. ఈ ఏడాది హెల్మెట్ కేసుల్లో 7,79,966 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు.ఇలా రూల్స్ బ్రేక్ చేసే వాళ్ళు ప్రత్యక్షంగా తమ జేబులు గుళ్ళ చేసుకుంటున్నారని అంటున్నారు. ఐతే ఇలాంటి వాహనదారులే టార్గెట్ గా స్పెషల్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు...పెండింగ్ చలానాలతో పట్టుబడితే వెహిల్ సీజ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామంటున్నారు. హైదరాబాద్‌ పోలీసులు చేపడుతున్న ట్రాఫిక్ చలానాల డ్రైవ్‌తో వాహనదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories