Top
logo

మునుగోడులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: ఉత్తమ్

మునుగోడులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా?: ఉత్తమ్
X
Highlights

ఐదేళ్లూ 16 మంది ఎంపీలున్నా కేసీఆర్ ఏమీ చేయలేదని, మళ్లీ ఏదో చేస్తానంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని...

ఐదేళ్లూ 16 మంది ఎంపీలున్నా కేసీఆర్ ఏమీ చేయలేదని, మళ్లీ ఏదో చేస్తానంటూ మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్‌కి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని అన్నారు. ఇవాళ నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నల్గొండలో పోటీలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి స్థానికులకు తెలియరని, గతంలో మునుగోడులో పోటీ చేసి ఓడిపోయారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో భూకబ్జాలు చేసి ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారని, మునుగోడులో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? అని ఆయన ప్రశ్నించారు.

Next Story