మళ్లీ గళమెత్తుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు...టీపీసీసీ ప్రక్షాళనకు వీహెచ్ డిమాండ్

మళ్లీ గళమెత్తుతున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు...టీపీసీసీ ప్రక్షాళనకు వీహెచ్ డిమాండ్
x
Highlights

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అసంతృప్తి భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతల తీరుపై మండిపడ్డ సీనియర్లు పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా గరం గరం...

తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అసంతృప్తి భగ్గుమంటోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నేతల తీరుపై మండిపడ్డ సీనియర్లు పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా గరం గరం అవుతున్నారు. టీపీసీపీ ప్రక్షాళన జరగాలని డిమాండ్ చేస్తున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పరేషాన్ లో వుంది. ఎమ్మెల్యేలు, నాయకుల ఫిరాయింపుతో ఆ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ నాయకుల తీరుపై మండిపడ్డ సీనియర్లు పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా గళం విప్పుతున్నారు. పార్టీని నమ్ముకున్నవారికి కాకుండా బడాబాబులకే ఎన్నికల్లో టికెట్లు కేటాయించారని సీనియర్ నేత వి. హనుమంతరావు ఆరోపించారు.

పార్లమెంటు ఎన్నికల్లో విహెచ్ ఖమ్మం టిక్కెట్టు ఆశించినా పీసీసీ నేతలు అధిష్టానానికి పంపిన లిస్టులో ఆయన పేరు చేర్చలేదు. దీంతో పీసీసీ అధ్యక్షుడు , సీఎల్పీ నేత తీరు పై విహెచ్ ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు రాహుల్ గాంధీ కూడా తీరు మార్చుకోక పోతే పార్టీకి నష్టం జరుగుతుంది అంటున్నారు వీహెచ్.

కాంగ్రెస్ లో సీనియర్లకు సరైన గుర్తింపు లభించడంలేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన కార్యకర్తలకు కాకుండా కొత్తగా వచ్చి చేరుతున్న డబ్బున్న నాయకులకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని చెబుతున్న వీహెచ్ పార్టీ బాగు కోసం టీపీసీసీ ప్రక్షాళన జరగాలంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories