Top
logo

టాప్ 10 న్యూస్ ...

టాప్ 10 న్యూస్ ...
Highlights

1. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు : నామా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్...

1. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు : నామా

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎలాంటి నిధులూ కేటాయించలేదని.. కేవలం అనుమతులు ఇచ్చి చేతులుదులుపుకున్నారని ఖమ్మం ఎంపి, టీఆర్ఎస్‌ లోక్‌సభ నేత నామ నాగేశ్వరరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం మాటలు మాత్రమే చెబుతోందని ఆయన మండిపడ్డారు.. ఏ ఒక్క తెలంగాణ ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదని.. కీలక బిల్లుల విషయంలో అండగా నిలిచినా.. అన్యాయమే చేస్తోందన్నారు.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్, మైనింగ్ యూనివర్సిటీ, రైల్వేలైన్లు, మిషన్ భగీరథకు నిధులు, ఖమ్మం జిల్లాకు మెడికల్ కాలేజీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు.

2. అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యం ; ఏపీ హోం మంత్రి సుచరిత

అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఏపీ హోం మంత్రి సుచరిత అన్నారు. కర్నూలు వెంకటరమణ కాలనీలో కోటి 50 లక్షలతో నిర్మించిన పోలీస్ రిజినల్ సిఐడి ప్రాంతీయ కార్యాలయ నూతన భవనాన్ని హోం మంత్రి ప్రారంభించారు. మహిళలు, బాలికల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. మహిళలు, బాలికల భద్రత సంరక్షణ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు.. ఇందులో భాగంగా సిఐడి పరిధిలోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ సైబర్ క్రైం పొలీస్ స్టేషన్లు మరింతగా సమర్థవంతంగా పనిచేసే చర్యలు తీసుకుంటామన్నారు.

3. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి

ధవళేశ్వరం వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.. ధవళేశ్వరం నుంచి 14 లక్షల 36వేల క్యూసెక్కుల ప్రవాహం సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.. వరద ఉధృతి కొనసాగుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరికను ఇంకా కొనసాగిస్తున్నారు.. మరోవైపు దేవీపట్నం మండలం, కోనసీమ లంక గ్రామాలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి..

4. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలం : చినరాజప్ప

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని మాజీ ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఎటువంటి సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించలేని ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు.. గోదావరి వరద ప్రభావం ఉన్న లంక గ్రామాలలో కుటుంబానికి పదివేలు చొప్పున ఆర్థిక సహాయం తక్షణమే ప్రభుత్వం అంద చేయాలని డిమాండ్ చేశారు...

5. పశ్చిమగోదావరి జిల్లా లంక గ్రామాలపై విరుచుకుపడుతున్న వరదనీరు

పశ్చిమగోదావరి జిల్లా లంక గ్రామాలపై గోదావరి విరుచుకుపడుతోంది. యలమంచిలి, ఆచంట మండలాల్లో పలు గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. గ్రామంలో రోడ్లు నదిని తలపిస్తుంటే, ఇళ్ళు వదిలి కాలు బయటపెట్టలేని పరిస్థితి ఉంది..

6. నిండిన శ్రీశైలం డ్యాం...

ఎగువన కురుస్తున్న వర్షాలతో నాగార్జున సాగర్‌కు వరద పోటెత్తింది.. భారీ వర్షాలకు కృష్ణా నదిపై ఉన్న డ్యాములన్నీ నిండుకుండలా మారాయి.. దీంతో శ్రీశైలం డ్యాం కూడా నిండింది.. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయడంతో నాగార్జునా సాగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరింది.. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం.. 590 అడుగులు కాగా ప్రస్తుతం 525.30 అడుగులకు చేరుకుంది.. దీంతో సాగర్ నుంచి 38వేల726 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

7. విద్యుత్ షాకుకు గురై రైతు మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పార్దసారధిపురం గ్రామంలో బెల్లంకొండ.సత్యనారాయణ అనే రైతు విద్యుత్ షాకుకు గురై మృతి చెందాడు. ఏకకాలంలో ఇద్దరు ఎల్ సి తీసుకొని స్తంభం ఎక్కారు. ఒకరి పని అయిపోగానే ఎల్ సి ఆన్ చెయ్యటంతో ఈ దారుణం జరిగింది. విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వలనే మృతువాత పడాల్సి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

8. పంచాయతీ సెక్రెటరీ పై దాడి...

గుంటూరు జిల్లా బెల్లకొండలో కలకలం రేగింది.. పెన్షన్ ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలని వితంతువు మహిళ.. పంచాయతీ సెక్రెటరీ గుర్గారావును కోరింది.. అయితే పంచాయతీ కార్యాలయానికి రాలేని వృద్ధులకు మాత్రమే.. ఇంటికి తీసుకొచ్చి పెన్షన్ ఇస్తామని ఆయన చెప్పడంతో.. వారిద్దరి మధ్యా వాగ్వాదం చోటుచేసుకుంది.. నిర్లక్ష్యంగా సమాధం చెబుతున్నాడంటూ పంచాయతీ సెక్రెటరీ పై ఫేక్ నిషాద్ బంధువులు దాడికి దిగారు. అనంతరం ఒకరిపై ఒకరు పీఎస్ లో ఫిర్యాదు చేసుకున్నారు..

9. భార్యపై అనుమానంతో భర్త హత్యాయత్నం

ఒంగోలు దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో ఓ భర్త హత్యాహత్యానికి పాల్పడ్డాడు.. బొర్రా సుబ్రమణ్యం అనే వ్యక్తి తన భార్య పనిచేస్తున్న జనరిక్‌ మెడికల్‌ షాప్‌లోకి దూసుకెళ్లి కూరగాయలు కోసే కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తీవ్రంగా ప్రతిఘటించిన ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి ఆమెను రక్షించారు. ఈ ఘటనలో ఆమెకు గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తన భార్య జ్యోతిపై అనుమానంతోనే ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణలో నిందితుడు అంగీకరించనట్లు పోలీసులు తెలిపారు. బాధితులు ప్రస్తుతం ఒంగోలులోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతోంది.

10. మౌలిక వసతులు సరిగ్గా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

ఖమ్మం జిల్లా వైరా మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో.. మౌలిక వసతులు సరిగ్గా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు మధిర రోడ్డులో ఆందోళన నిర్వహించారు. మరుగుదొడ్లు, డార్మెంటరీ లు పూర్తి శిథిలావస్తకు చేరుకున్నాయని.. పాఠశాలలో కోతుల బెడద కూడా ఎక్కువగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.. విషయం తెలుసుకున్న వైరా ఎస్సై విద్యార్థుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పడంతో వారు శాంతించారు.

Next Story