టాప్‌ హీరోస్‌ ... ట్రాఫిక్‌ చలాన్స్

heros
x
heros
Highlights

వేగం మానుకో ప్రాణం నిలుపుకో అంటూ బుల్లితెర నుంచి వెండి తెర వరకు ప్రచారం చేసే స్టార్ హీరోలు తాము మాత్రం ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం లేదు. తమ భద్రతతో పాటు ఎదుటి వారి భద్రత ప్రమాదంలో పడుతున్నా వేగంతో పరుగులు పెడుతున్నారు.

వేగం మానుకో ప్రాణం నిలుపుకో అంటూ బుల్లితెర నుంచి వెండి తెర వరకు ప్రచారం చేసే స్టార్ హీరోలు తాము మాత్రం ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం లేదు. తమ భద్రతతో పాటు ఎదుటి వారి భద్రత ప్రమాదంలో పడుతున్నా వేగంతో పరుగులు పెడుతున్నారు. తెలుగు చలన చిత్ర రంగంలో అగ్ర స్ధానంలో ఉన్న పలువురు హీరోలు పరిమితికి మించిన వేగంతో వాహనాలు నడిపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో పాటు , బాలకృష్ణ, కౌబాయ్ మహేష్ బాబులు ఉన్నారు. 2016 నుంచి వీరి పేరు మీద పలు చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నట్టు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇటీవలే జీఎస్టీ వివాదంతో వార్తల్లోకి ఎక్కిన కౌబాయ్ మహేష్‌ బాబు చలాన్‌ల విషయంలో అందరి కంటే ముందున్నారు. 2016 నుంచి ఇప్పటివరకు మహేష్ బాబు వాహనం(ఏపీ 09 CM 4005) పై అత్యధికంగా ఏడు చలాన్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై 8 వేల 745 రూపాయల వరకు డబ్బు కూడా చెల్లించాల్సి ఉంది. వీటిలో ఆరు చలాన్లు అతి వేగంతో కూడుకున్నవిగ ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు.

ఇక సినీనటుడు కం ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య వాహనంపై ఓ చలాన్ ఉంది. తన వాహనం (ఏపీ 36 Q 0001) పరిమితికి మించి అధిక వేగంతో వెళ్లినట్టు హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఒక వెయ్యి 35 రూపాయల చలాన్ పెండింగ్‌లో ఉంది. ఇదే సమయంలో మరో స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ వాహనంపై కూడా ఇదే తరహాలో చలాన్లు ఉన్నట్టు ట్రాఫిక్ విభాగం తెలియజేసింది. తన వాహనం (ఏపీ 09 సీజీ 7778) నాన్ పార్కింగ్ ప్లేస్‌ నిలపడంపై మూడు చలాన్లు నమోదయ్యాయి. వీటిపై 505 రూపాయలు పెండింగ్‌లో ఉన్నట్టు రవాణా శాఖ అధికారులు తెలియజేశారు.

వీరితో పాటు హీరో నితిన్‌, కమెడియన్ కం హీరో సునీల్ పై ఇదే తరహాలో చలాన్లు నమోదయ్యాయి. హీరో సునీల్ ‌కారుపై మూడు ఓవర్ స్పీడ్‌ చలాన్లతో పాటు మరో చలాన్ నమోదయ్యింది. వీటిపై నాలుగు వేల 5 వందల 40 రూపాయల మేర పెండింగ్‌లో ఉంది. మరో హీరో నితిన్ కారు మీద నాలుగు చలాన్లపై వెయ్యి రూపాయల మేర ఫైన్ చెల్లించాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories