Top
logo

టాప్ 5 న్యూస్ ...

టాప్ 5 న్యూస్ ...
Highlights

జూడాల ఆందోళనతో అలిపిరిలో టెన్షన్‌..అఖిల భారత వైద్య మండలి.. MCI స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్.. NMC ను ఏర్పాటు ...

జూడాల ఆందోళనతో అలిపిరిలో టెన్షన్‌..


అఖిల భారత వైద్య మండలి.. MCI స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్.. NMC ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు ఆందోళనకు దిగారు.ఏపీని ఆర్ధికంగా ఆదుకోండి..ఢిల్లీ టూర్‌లో కేంద్ర పెద్దలకు జగన్ విజ్ఞప్తులు


ఏపీ సీఎం జగన్మోహన్‌‌రెడ్డి రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కలిసిన వైఎస్ జగన్‌ రాష్ట్రాన్ని ఆర్ధికంగా ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేశారు. అలాగే, వివాదాస్పదమైన పోలవరం టెండర్ల రద్దు, పీపీఏల సమీక్షపై మోడీకి వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.హాట్ టాపిక్ కి తెర లేపిన నాగ్ ...


అక్కినేని నాగార్జున రకుల్ ప్రీత్ జంటగా నటిస్తున్న చిత్రం మన్మధుడు 2.. ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకుడు .. ఈ సినిమా ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకుంది .గతంలో వచ్చిన మన్మధుడు సినిమాకి ఇది కొనసాగింపు ..
టీవీ నటుడు మధు ప్రకాష్ అరెస్ట్ ..


కుంకుమ పువ్వు సీరియల్ ఫేం మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . తన భార్య భారతి ఆత్మహత్య చేసుకున్న నేపధ్యంలో మధు ప్రకాష్ ని పోలీసులు అరెస్ట్ చేసారు . అయితే భారతిది ఆత్మహత్య కాదని హత్యేనని ఆమె కుటుంబ సభ్యలు చెబుతున్నారు .మహిళా కమిషన్‌ చైర్మన్‌ పదవికి నన్నపనేని రాజీనామా


టీడీపీ మహిళా నాయకురాలు నన్నపునేని రాజకుమారి మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ బిశ్వభూషన్‌ హరిచందన్‌కి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం మారింది కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశానన్నారు నన్నపనేని రాజకుమారి.


Next Story


లైవ్ టీవి