టాప్ 5 న్యూస్

టాప్ 5 న్యూస్
x
Highlights

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స...

ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల మృతి


ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న దేవదాస్ కనకాల కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.




ఎమ్మెల్యే వర్సెస్‌ తహశీల్దార్‌..బహిరంగ వేదికపైనే వాగ్వాదం


వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు బొల్లాపల్లి తహశీల్దార్‌ బాలకృష్ణ మధ్య వాగ్వాదం జరిగింది. జలశక్తి అభియాన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేదికపైనే అధికారులపై విరుచుకుపడ్డారు. బొల్లాపల్లి మండలానికి ఆదినుంచీ కష్టాలేనన్న ఎమ్మెల్యే బొల్లా మండలంలో 900కి పైగా సర్వే నెంబర్లు ఉంటే, 600 సర్వే నెంబర్లకు ఆన్‌‌లైన్ రికార్డులు లేవంటూ ప్రశ్నించారు.



అమర్‌నాథ్‌ యాత్రపై ఉగ్ర గురి..పాక్ కుట్రను గుర్తించిన ఆర్మీ


అమర్‌‌నాథ్‌ యాత్రపై ఉగ్రదాడికి పాక్ కుట్ర పన్నింది. కొద్దిరోజులుగా అమర్‌‌నాథ్‌ యాత్రను అడ్డుకుంటోన్న ఉగ్రమూకలు భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు ఇండియన్ ఆర్మీ గుర్తించింది. ఉగ్రదాడి జరిగే అవకాశమున్నందున తక్షణమే అమర్‌‌నాథ్‌ యాత్రను విరమించుకోవాలని సూచించింది.




మళ్లీ మొదటికొచ్చిన అయోధ్య రామజన్మభూమి వివాదం


ఆయోధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. దీనిపై సుప్రీం కోర్టు కీలక కీలక వ్యాఖ్యలు చేసింది. సమస్య పరిష్కారంలో మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని సుప్రీం కోర్టు తెలిపింది. ఆగస్టు 6 నుంచి రోజువారీ విచారించాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది.



జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన బృందాకారత్‌


సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్‌ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీతో జగన్ పరోక్ష అనైతిక పొత్తు పెట్టుకున్నారని ఆరోపించిన బృందాకారత్. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పార్లమెంట్‌లో వైసీపీ వ్యవహరిస్తోందన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories