టాప్ 5 న్యూస్ ...

టాప్ 5 న్యూస్ ...
x
Highlights

ట్రిపుల్ తాలాక్ బిల్లుకు నో చెప్పిన వైసీపీ ... కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకి వైసీపీ అభ్యతరం...

ట్రిపుల్ తాలాక్ బిల్లుకు నో చెప్పిన వైసీపీ ...


కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ ప్రవేశ పెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకి వైసీపీ అభ్యతరం చెప్పింది . ట్రిపుల్ తలాక్ ని నేరంగా పరిగణించడం సరికాదని అ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి అన్నారు . ఈ బిల్లుని ప్రవేశపెడితే అమాయకులు జైలుకు వెళ్ళవలిసి ఉంటుందని అయన చెప్పుకొచ్చారు .



హాట్ స్టార్ వల్లే నాకు ఓట్లు పడలేదు .. హేమ


అందరు అనుకున్నట్టుగానే బిగ్ బాస్ నుండి మొదటివారంలో హేమ ఎలిమినేట్ అయ్యింది . ఎలిమినేట్ విషయాన్ని ఆమె చాలా సింపుల్ గా తీసుకున్నారు . చాలా పాజిటివ్ తో బయటకు వచ్చింది ఆమె . అయితే మంగళవారం రోజు మీడియా సమావేశం నిర్వహించిన హేమ బిగ్ బాస్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది .



ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా


ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. మొత్తం 14రోజులపాటు బడ్జెట్‌ సమావేశాలు జరగగా, 78గంటల 35నిమిషాలు సభ కొనసాగింది. ప్రభుత్వం 20 బిల్లులను ప్రవేశపెట్టగా 19 కీలక బిల్లులను సభ ఆమోదించింది.



గేల్ అదరగొట్టాడు .. కానీ మ్యాచ్ రద్దు


ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు వెస్టిండీస్ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్.. గ్లోబల్ టీ 20 కెనడా లీగ్ లో భాగంగా జరిగిన సోమవారం వాన్‌కూవర్‌ నైట్స్‌, మోంట్రియల్‌ టైగర్స్‌ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదటగా బ్యాటింగ్ చేసిన వాన్‌కూవర్‌ నైట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 276 పరుగులు సాధించింది.



త్వరలోనే అందరి విషయాలు బయటపెడతా : పూరి


ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి విజయం సాధించడంతో పూరి మళ్ళీ హిట్టు ట్రాక్ ఎక్కాడు . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది . ఇప్పటికే ఈ సినిమా ఎనమిది రోజుల్లో 63 కోట్లు సాధించినట్లు నిర్మాత చార్మీ తెలిపారు .


Show Full Article
Print Article
More On
Next Story
More Stories