టాప్ 5 న్యూస్ @ 11 AM

టాప్ 5 న్యూస్ @ 11 AM
x
Highlights

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహణపై శ్రీ త్రిదండి చినజీయర్...

మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం


మరో మహా యాగానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. యాదాద్రిలో మహా సుదర్శన యాగం నిర్వహణపై శ్రీ త్రిదండి చినజీయర్ స్వామితో కేసీఆర్ చర్చించారు. వంద ఎకరాల స్థలంలో 1048 యజ్ఞ కుండాలు, 6వేలమంది రుత్వికులతో మహాయాగం జరుపనున్నారు.



బిగ్ బాస్ లోకి రకుల్. ఎందుకంటే ...!


ఎన్నో వివాదాల మధ్య బిగ్ బాస్ తన థర్డ్ సీజన్ ని మొదలు పెట్టింది . అందులో భాగంగానే తన మొదటివారాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది . ఈ సీజన్ కి బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నాడు . అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ లోకి నాగార్జున రకుల్ ని తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది .



ఐటీఆర్ గడువు పెంపు ...


ఐటీ రిటర్నులు సమర్పించడానికి గడువు తేదీని ప్రభుత్వం ఆగస్టు 31 వరకు పొడిగించింది .. సాధారణంగా అయితే మాత్రం ఆర్థిక సంవత్సరానికి సంబంధించినవి సమర్పించేందుకు జూలై 31 చివరి తేదీ కానీ ఐటీఆర్ సమర్పణ గడువు తేదీని పెంచాలని వచ్చిన డిమాండ్ల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.



మైనర్ బాలికను గర్భవతిని చేసిన ఉపాధ్యాయుడు


ఓ విద్యార్ధినికి విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడి బుద్ది మళ్ళింది. విధ్యాభోదన చేయాల్సింది పోయి ప్రేమ అంటూ అ బాలికను లొంగదీసుకున్నాడు . ఫలితంగా ఆమె ఆరు నెలల గర్భం దాల్చింది . ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని ఆదిమూర్తిపల్లె గ్రామంలో చోటు చేసుకుంది . గత ఏడాది పదవ తరగతి పూర్తి చేసుకున్న ఓ బాలిక(16) ఇంటర్ మొదటి సంవత్సరంలోకి అడుగు పెట్టింది .



కాఫిడే యజమాని వీజీ సిద్ధార్థ ఆత్మహత్య


కర్ణాటక మాజీ సీఎం ఎస్ ఎం కృష్ణ అల్లుడు సిద్ధార్థ మిస్సింగ్‌ ట్రాజిడిగా మారింది.రెండ్రోజుల క్రితం కనిపించకుండా పోయిన కేఫ్‌ కాఫీ డే వ్యవస్థాపకుడు ఆత్మహత్య చేసుకున్నారు. నేత్రావతి నదిలో ఆయన మృతదేహాం లభించింది. సుమారు 300మందికిపైగా గజ ఈతగాళ్లు జల్లెటపట్టారు. దాదాపు 36 గంటల గాలింపు తర్వాత తెల్లవారుజామున సిద్ధార్థ మృతదేహాన్ని బయటకు తీశారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories