logo

టాప్ 5 న్యూస్

టాప్ 5 న్యూస్
Highlights

నేడు నగరంలో బోనాల వేడుకలు...హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ...

నేడు నగరంలో బోనాల వేడుకలు...

హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంతో పాటు నగరం లోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. నగరం పరిధిలో 2500 ఆలయాల్లో ఆషాఢ మాసం బోనాలు జరుగుతున్నాయి. ప్రసిద్ధి గాంచిన పాతబస్తీలోని లాల్ దర్వాజలో కొలువైన సింహవాహిని మహంకాళి ఆలయంలో బోనాల జాతర జరుగుతుంది. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రత్యేక పూజలు చేస్తున్నారు.


కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎస్‌. జైపాల్‌రెడ్డి కన్నుమూశారు. కొద్దిరోజులుగా నిమోనియాతో బాధపడుతున్న ఆయన ఈనెల 20న గచ్చిబౌలిలోని ఏషియన్‌ గ్యాస్‌ ఎంట్రాలజీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్సపొందుతూ ఈరోజు తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణలోని మహబూబ్‌నగర్‌జిల్లా మాడుగులలో 1942 జనవరి 16న జైపాల్‌రెడ్డి జన్మించారు.


బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్ళేది అతనేనా?

వారాంతం లో బిగ్ బాస్ హంగామా వేరుగా ఉంటుంది. వారం రోజుల పాటు హౌస్ లో జరిగిన విశేషాలన్నిటి పై విశ్లేషణ చేసి.. వచ్చే వారానికి హౌస్ మేట్స్ అందరూ హుషారుగా ఉండేలా చేసే ఎపిసోడ్ లు ప్రసారం అవుతాయి. హోస్ట్ హౌస్ మేట్స్ కి కనిపించేది ఈ రెండు రోజులే.



ఉమ్మడి వరంగల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు

ఎండకు ఎండిపోయిన పైర్లు.. కళ్ల ముందే పంట నాశనం అవుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి.. నిన్నటి వరకూ వరంగల్ రైతన్నల పరిస్థితి ఇది.. తాజాగా కురిన వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.. ఖరీప్ పంటలకు ఇక డోకా లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



తెలుగు సినిమా సింధూరం "కృష్ణవంశీ"


తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది దర్శకులు ఉన్నారు . కానీ ప్రేక్షకుల మదిలో నిలిచినా దర్శకులు మాత్రం కొందరే ఉన్నారు . అందులో కృష్ణవంశీ ఒకరు ..కృష్ణవంశీ అసలు పేరు పసుపులేటి వెంకట బంగారు రాజు.. తెలుగు సినీ పరిశ్రమలో సృజనాత్మక కలిగిన దర్శకుడుగా మరియు ఫ్యామిలీ మూవీస్ స్పెషలిస్ట్ గా కృష్ణవంశీకి మంచి పేరుంది .



లైవ్ టీవి


Share it
Top