Top
logo

టాప్ 10 న్యూస్....

టాప్ 10 న్యూస్....
X
Highlights

1. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష... వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 108, 104 వాహనా...

1. వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష...

వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. 108, 104 వాహనాలు ఎప్పుడూ మంచి కండిషన్‌లో ఉండాలని అధికారులను ఆదేశించారు. కనీసం ఆరు ఏళ్లకు ఒకసారి వాహనాలను మార్చాలన్నారు. వేయి వాహనాలను ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేస్తున్నామని.. కొత్త వాహనాలకు సెప్టెంబర్‌లో టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు వెల్లడించారు.

2. సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన ...

సిరిసిల్ల పట్టణంలోని పొదుపు భవన్ ఆవరణలో కంటి ఆస్పత్రి భవనానికి.. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కంటి వెలుగు దేశంలో ఎక్కడా జరగలేదు. కంటి వెలుగు పథకంతో పేదలకు కంటి పరిక్షలు చేయించామని తెలిపారు.

3. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఏపీలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమరావతిలోని అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలకు రంగు రంగు విద్యుత్ దీపాలతో అలకరించారు. విద్యుత్ కాంతులతో ఈ రెండు భవనాలు కళకళలాడుతున్నాయి.

4. నాగార్జునసాగర్‌ను సందర్శించనున్న జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ ఉదయం 10 గంటలకు నాగార్జునసాగర్‌ను సందర్శించనున్నారు. జగన్ వెంబడి ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ రానున్నారు. జగన్ సాగర్ పర్యటనలో తెలంగాణ మంత్రులు కూడా పాల్గొంటారు.

5. ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయవచ్చు : పవన్ కల్యాణ్

తెలుగు సాహిత్యం ఎంతో గొప్పదని, బాహుబాలి లాంటి ఎన్నో అద్భుత సినిమాలు తీయవచ్చని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ చెప్పారు. హైదరాబాద్ లో ప్రముఖ పాత్రికేయుడు తెలకపల్లి రవి రచించిన మన సినిమాలు, అనుభవాలు, చరిత్ర, పరిణామం' అనే పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఇతర భాషాల చిత్రాల వలే తెలుగు సినిమాల చరిత్రను నిక్షిప్తం చేయాలని కోరారు. తెలుగు సాహిత్యాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ప్రపంచాన్ని శాసించే సినిమాలు తీయవచ్చు అని అన్నారు.

6. నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు షాక్ ఇచ్చారు. నాగశౌర్య ప్రయాణిస్తున్న కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో పంజాగుట్ట లో ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు.. అనంతరం కారు అద్దాలకున్న బ్లాక్ స్టిక్కర్లను తొలగించారు.

7.పెన్నా నదిలో నలుగురు గల్లంతు

కడప జిల్లా కమలాపురం సమీపంలోని పెన్నా నదిలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరి మృత దేహం లభ్యంకాగ.. మరో ముగ్గురి చిన్నారుల కోసం గాలిస్తున్నారు. పెన్నా నదిలో గల్లంతయిన వారిని షాహిద్, చాంద్ బాషా, జాఖీర్.. ధర్గావీదికి చెందిన వారిగా గుర్తించారు. సరదాగ ఈత కోసమని వెళ్తే నీటిలొమునిగిపోయారని తెలుస్తోంది.

8. జగన్ అమెరికా పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 15నున అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం గా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటిసారి జగన్ అమెరికా వెళుతున్నారు. ఈ నెల 17న ముఖ్యమంత్రి జగన్ తెలుగువారితో సమావేశం అవుతారు. సీఎం జగన్ యూస్ టూర్‌ను సక్సెస్ చేసేందుకు ఆ పార్టీ నేతలు విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

9. తొలిసారి కశ్మీర్‌లో మువ్వన్నెల జెండా

దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత.. తొలిసారి కశ్మీర్‌లో మువ్వన్నెల జెండా ఎగరనుంది.. జమ్మూ-కశ్మీరును దేశంలో పూర్తిగా అంతర్భాగం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

10. సుష్మా సేవలు చిరస్వరణీయం

దేశ అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన మహా మనిషి సుష్మా స్వరాజ్ అని.. ప్రధాని మోడీ కొనియాడారు.. దేనానికి ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమన్న ఆయన.. ప్రొటోకాల్ కు ఉన్న అర్ధాన్నే ఆమె మార్చేశారని తెలిపారు.. ఢిల్లీలో జరిగిన కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ సంస్కరణ సభలో మోడీ, అమిత్ సా, అద్వానీలతో పాటు పలువురు నేతలు పాల్గొని నివాళులు అర్పించారు.

Next Story