Top
logo

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
X
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఆహ్మద్ ఖాన్ అసెంబ్లీలో సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ నెల 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. 19న ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. తెలంగాణ శాసనసభా సమావేశాలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ రాజ్‌భవన్‌లో ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌తో ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీ,ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, పలువురు టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

ప్రొటెం స్పీకర్ అహ్మద్‌ఖాన్ అధ్యక్షతన ఉదయం 11.30 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలచే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి గన్ పార్క్ వద్ద అమరులకు నివాళిలర్పించనున్నారు. ఈ నెల 18న స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌ల ఎన్నిక జరుగనుంది. 19న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారు. 20న గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టనున్నారు.

Next Story