Top
logo

రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

రేపే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
X
Highlights

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎప్పుడెప్పుడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల...

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎప్పుడెప్పుడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. తమ పరిస్థితి ఏమవుతుందోనని అభ్యర్థుల్లో గుబులు రేపుతోంది. ఇటీవల వెలువడిన లోక్‌సభ ఫలితాలు అభ్యర్థులను మరింత టెన్షన్‌ పెడుతున్నాయి. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడతారోననే ఉత్కంఠ అభ్యర్థులతో పాటు ప్రజల్లోనూ నెలకొంది. ఇప్పటికే కౌంటింగ్‌కు సంబంధించి ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు ఓట్ల లెక్కింపును పూర్తయ్యేలా ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 123 కౌంటింగ్ కేంద్రాల్లోని 978 హాళ్లలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. సుమారు 34వేల మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. జులై 3న ఎంపీటీసీ, జులై 4న జెడ్పీటీసీల ప్రమాణస్వీకారం ఉంటుంది.

Next Story