logo

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శక నిర్మాత విజయ బాపినీడు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు, నిర్మాత విజయ బాపినీడు కన్నముశారు. 19 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఎక్కువగా చిరంజీవి, శోభన్‌ బాబు చిత్రాలకు దర్శకత్వం వహించారు. విజయ బాపీనీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్‌ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రులో జన్మించారు. తెలుగులో 1981లో డబ్బు డబ్బు డబ్బు సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన ఆయన తరువాత పట్నం వచ్చిన పతివ్రతలు, మగ మహారాజు, మహానగరంలో మాయగాడు, హీరోలాంటి వరుస విజయాలతో కమర్షియల్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. రాజేంద్ర ప్రసాద్‌ లాంటి కామెడీ హీరోలతోనూ వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించి ఆకట్టుకున్నారు.

Arun

Arun

undefined Contributors help bring you the latest news around you.


లైవ్ టీవి

Share it
Top