ఫుల్ టైమ్ రాజకీయాలపై అలీ ఫోకస్ .. గుంటూరు నుంచి టీడీపీ తరఫున పోటీ?

ali
x
ali
Highlights

హాస్యనటుడు అలీ ఫుల్ టైమ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

హాస్య నటుడు అలీ రాజకీయ రంగం ప్రవేశం ఖరారైందా...? అలీ ఏ పార్టీలో ఉంటారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠకు తెర పడిట్లేనా అలీ గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా..?

హాస్యనటుడు అలీ ఫుల్ టైమ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఆయన సందిగ్ధత తీరింది. టీడీపీ నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లుగా టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

20ఏళ్లుగా టీడీపీ లో ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అలీ. సినిమా రంగంలో పవన్, అలీ సన్నిహితులు . పవన్ పార్టీ ఏర్పాటు చేయడంతో అలీ జనసేనలోకి వెళతారనే ప్రచారం జోరుగా సాగింది. ఈమధ్య వైసీపీ అధినేత జగన్ తో భేటీ కావడంతో వైసీపీలోకి జంప్ అవుతారంటూ ప్రచారం జరిగింది. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుతోనూ భేటీ అయ్యారు. దీంతో అలీ టీడీపీలోనే ఉంటారనే వార్తలు వచ్చాయి.

చంద్రబాబు సూచన మేరకు అలీ టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయనకు గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి సీటు ఇస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారని తెలిసింది. అలీకి బంధువులు కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నారని తన సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటంతో ఈ స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories