Top
logo

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

నేడు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
X
Highlights

తెలంగాణ అంతటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్నవేళ...

తెలంగాణ అంతటా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందడి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్నవేళ ప్రజలంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక గన్ ‌పార్క్‌ దగ్గర అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్న సీఎం కేసీఆర్‌, ఆ తర్వాత జూబ్లీహాల్లో నిర్వహించే రాష్ట్ర ఆవతరణ వేడుకల్లో పాల్గోనున్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది.‌ తెలంగాణ రాష్ట్రం ఐదు ప్రగతి వసంతాలను విజయవంతంగా పూర్తిచేసుకొని ఆరో వసంతంలోకి అడుగుపెడుతున్నవేళ రాష్ట్రమంతటా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే మహోద్యమంతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. తొలి ఐదేళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన అడుగులు పడ్డాయన్న కేసీఆర్‌ ప్రజలకు మరింత మెరుగైన పారదర్శక పాలన అందిస్తామన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌ నగరం విద్యుత్‌ వెలుగుల్లో వెలిగిపోతోంది. గన్‌‌పార్క్ దగ్గర అమరవీరుల స్థూపాన్ని ప్లవర్స్‌తో అందంగా డెకరేట్ చేశారు. అలాగే, సెక్రటేరియట్, అసెంబ్లీ, నెక్లెస్ రోడ్డు, చార్మినార్, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, కాచిగూడ రైల్వే స్టేషన్లను విద్యుద్దీపాలతో అలంకరించారు. దాంతో గ్రేటర్ హైదరాబాద్ ధగధగ మెరిసిపోతోంది.

Next Story