నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంపై ఉత్కంఠ...పార్టీల్లో విత్ డ్రా..టెన్షన్...

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంపై ఉత్కంఠ...పార్టీల్లో విత్ డ్రా..టెన్షన్...
x
Highlights

లోక్‌సభ మొదటి విడత ఎన్నికలు, ఏపీ శాసనసభకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల బరిలో ఎంత మంది...

లోక్‌సభ మొదటి విడత ఎన్నికలు, ఏపీ శాసనసభకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళే చివరి రోజు కావడంతో పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల బరిలో ఎంత మంది నిలవనున్నారు? ఎవరు తమకు ప్రత్యర్ధులో అనే విషయం ఈ రోజు సాయంత్రానికి తేలనుంది. ఈ విషయమై ఎన్నికల సంఘం ప్రకటన చేయనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు 3,989 నామినేషన్లు, 25 ఎంపీ స్థానాలకు 596 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళగిరి అసెంబ్లీ స్థానానికి ఎక్కువ మంది అభ్యర్ధులు నామినేషన్ వేశారు. నంద్యాల లోక్‌సభ స్థానానికి అత్యధికంగా 38 నామినేషన్ల దాఖలయ్యాయి. చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గానికి 13 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో ఎంత మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో మరికొన్ని గంటల్లో తేలనుంది.

తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 646 మంది అభ్యర్థులు 795 నామినేషన్లు దాఖలుచేశారు. వీటిలో 513 నామినేషన్లు సరిగా ఉన్నట్లు ధ్రువీకరించగా నిబంధనల ప్రకారం లేని 133 నామినేషన్లను తిరస్కరించారు. నిజామాబాద్ నియోజకవర్గంలో అత్యధికంగా 203 మంది 245 నామినేషన్లు దాఖలుచేశారు. వీటీలో 191 మంది నామినేషన్లు సరిగ్గా ఉన్నాయి.

పసుపు, ఎర్రజొన్న రైతుల వ్యవహారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిజామాబాద్ రైతులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ చివరి రోజు కావడంతో నిజామాబాద్ జిల్లాలో ఉత్కంఠ కొనసాగుతోంది. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని రైతులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారు. ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ నామినేషన్లు ఉపసంహరించుకోరాదని తీర్మానించారు రైతులు. దీంతో రైతులు నామినేషన్లు ఉపసంహరించుకుంటారా, లేక పోటీలో ఉంటారా అన్నది నిజామాబాద్ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.

నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తరువాతే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారు. ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో అభ్యర్థులు 96కు మించితే పేపర్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తారు. ఈవీఎంలకు బదులు పేపర్‌ బ్యాలెట్‌ను ఈసీ వినియోగించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories