తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు మోస్తరు వర్షాలు
x
Highlights

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు...

తెలంగాణలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడవచ్చని పేర్కొంది. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడినట్లు వివరించింది.తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న ఓ మాదిరి వర్షాలు కురిశాయి. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌లో 37.5 మిల్లీమీటర్లు, వికారాబాద్‌ 22.3, మేడ్చల్‌, మల్కాజిగిరి, ఘట్‌కేసర్‌ మండలం సింగాపూర్‌, హైదరాబాద్‌లోని మైత్రివనంలో 20, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పలు జిల్లాల్లో ఈదురు గాలులతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగింది. మరోవైపు పలు జిల్లాల్లో భానుడు ప్రతాపం చూపాడు.

మరోవైపు ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలుచోట్ల సోమవారం నుంచి 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా ఈదురుగాలులు వీస్తాయని, పిడుగులు కూడా పడతాయని హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories