Top
logo

అమిత్‌షాపైనే పోటీ చేస్తా..

అమిత్‌షాపైనే పోటీ చేస్తా..
X
Highlights

సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీనేతలు ఇప్పటి నుంచే తమ పావులను కదుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణరంగంలో నువ్వా నేనా అని సవాళ్లకు ప్రతిసవాళ్లు వీసురుకుంటున్నాయి.

సార్వత్రిక ఎన్నికలకు ఆయా పార్టీనేతలు ఇప్పటి నుంచే తమ పావులను కదుపుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ రణరంగంలో నువ్వా నేనా అని సవాళ్లకు ప్రతిసవాళ్లు వీసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ అభిషేక్ సంచలన ప్రకటన చేశారు. తాను బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పై పోటీ చేస్తానని శుక్రవారం వెల్లడించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని 42 నియోజకవర్గాల్లో అమిత్ షా ఎక్కడి నుండైనా పోటీకి దిగినా తాను అమిత్ షా పైనే పోటీకి దిగుతానని అభిషేక్ స్పష్టం చేశారు. అమిత్ షాపై పోటీకి దిగి ఓడిస్తానని అన్నారు. పశ్చిమబెంగాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని 2019లో దేశాధినేతగా చూడాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

Next Story