టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌.. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే

టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్‌.. కేంద్రంలో మళ్లీ ఎన్డీయే
x
Highlights

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలన్నీ సర్వేలు విడుదల చేశాయి. మొత్తంగా చూస్తుంటే ఎన్డీఏ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని...

సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వే సంస్థలన్నీ సర్వేలు విడుదల చేశాయి. మొత్తంగా చూస్తుంటే ఎన్డీఏ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. అదే సమయంలో 2014తో పోల్చితే యూపీఏ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని చెబుతున్నాయి. బీజేపీ భారీ మెజార్టీతో కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తుందని టైమ్స్ నౌ- వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. 2014లో మాదిరిగానే ఈసారి కూడా ఎన్డీఏ అత్యధిక స్థానాలను గెలుచుకోబోతుందని తెలిపింది.

అధికారం కోసం చివరి నిమిషం వరకు పోరాడిన కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని ఈ సర్వే చెబుతోంది. ఎన్డీఏకు 306 స్థానాలు వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. యూపీఏ 132 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. 104 స్థానాల్లో ఇతరులు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది.

ఏపీలో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే తెలిపింది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 2, బీజేపీ 1, ఎంఐఎం 1 స్థానాలను దక్కించుకుంటాయని చెప్పింది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ 336 స్థానాల్లో విజయం సాధించింది. యూపీఏ 62, ఇతరులు 145 స్థానాల్లో గెలుపొందారు. కిందటిసారి ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 282 స్థానాల్లో విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల తుది ఫలితాలు మే 23న వెలువడనున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories