5+2 రీ పోలింగ్...చంద్రగిరిలో భారీగా పోలీసుల మోహరింపు

5+2 రీ పోలింగ్...చంద్రగిరిలో భారీగా పోలీసుల మోహరింపు
x
Highlights

తుదిదశ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో...

తుదిదశ పోలింగ్‌కు కొన్ని గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని తాజాగా ఆదేశించింది. రామచంద్రాపురం మండలంలోని కుప్పం బాదూరు, కాలూరులో ఆదివారం రీపోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఇటీవలే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈసీ తాజా నిర్ణయంతో రేపు చంద్రగిరి నియోజకవర్గంలో మొత్తం ఏడు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది.

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో పొలిటికల్ హీట్ అంతకంతకూ పెరుగుతోంది. మరో రెండు స్థానాల్లో రీపోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. టీడీపీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఈసీ ఆమోదం లభించింది. ఈ రెండు కేంద్రాలతో పాటు ఎన్‌.ఆర్‌.కమ్మపల్లి, పులవర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకటరామాపురం కేంద్రాలతో కలిపి ఆదివారం మొత్తం 7 కేంద్రాల్లో రీపోలింగ్‌ జరగనుంది.

వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు చంద్రగిరిలో ఇప్పటికే 5 పోలింగ్ బూత్‌లతో రీపోలింగ్ నిర్వహణకు ఈసీ ఆమోదం తెలిపింది. తాజాగా తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు రామచంద్రపురం మండలం కుప్పం బాదూరు, కాలేపల్లిలోని పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రగిరి రీపోలింగ్ నిర్వహణ అంశం టీడీపీ, వైసీపీల మధ్య అగ్గి రాజేస్తోంది. చంద్రగిరిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొని ఉంది. రీపోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు చంద్రగిరి రీపోలింగ్ అంశంపై ఢిల్లీలోని ఈసీ కార్యాలయం చుట్టూ వివాదం ముసురుకుంది. పోలింగ్ జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్ ఎలా నిర్వహిస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈక్రమంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఆదేశాలు రావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, చంద్రబాబు ఆరోపణలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గంలో జరగనున్న రీపోలింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories