టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!

టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం!
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇటివలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముసిగిన తరువాత కూడా పార్టీ ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. తెలంగాణ రాష్ట్ర...

తెలంగాణ రాష్ట్రంలో ఇటివలే అసెంబ్లీ ఎన్నికలు ముగిసి, తాజాగా లోక్‌సభ ఎన్నికలు ముసిగిన తరువాత కూడా పార్టీ ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీలోకి రోజురోజుకు వలసలు జోరుందుకుంటున్నాయి. అయితే ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు గూలాబీ గూటికి చేరిన విషయం తెలిసిందే. ఇటు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా బీజేపీ తీర్ధంపుచ్చున్నారు. అయితే ఈ నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనానికి రంగం సిద్ధం అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున 19 మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి తెలిసిందే కాగా ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.

తాజాగా మరో ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ గూటికి చేరేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ ముగ్గురు కూడా టీఆర్‌ఎస్‌లో చేరితే మొత్తం 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గూలాబీ గూటికి చేరినట్లు. ఇక దీంతో తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాను కోల్పోనుంది. ఇక ఈ 13 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను స్పీకర్‌కు అందజేసేందుకు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ మంతనాలు జరుపుతోంది. కాగా సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా వీరు స్పీకర్‌ కార్యాలయాన్ని కోరనున్నారు. ఇక ఈ సంవత్సరం జూన్‌ మొదటి వారంలో అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నా నేపథ్యంలోనే ఈలోపే విలీన పక్రియ పూర్తి చేయాలని అధికార పార్టీ టీఆర్ఎస్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories