ఏటీఎంలలో ఇంటి దొంగలు...డూప్లికేట్ కీ తో...

atm
x
atm
Highlights

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఓ ఘరానా మోసగాడిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. ఏటీఎంలలో నగదును లోడ్ చేసే ఓ సంస్థకు చెందిన సిబ్బంది డూప్లికేట్ కీ తో దర్జాగా అదే ఏటీఎం నుండి నగదును తీసుకెళుతున్న వైనాన్ని గుట్టు రట్టు చేశారు .

తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఓ ఘరానా మోసగాడిని పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. ఏటీఎంలలో నగదును లోడ్ చేసే ఓ సంస్థకు చెందిన సిబ్బంది డూప్లికేట్ కీ తో దర్జాగా అదే ఏటీఎం నుండి నగదును తీసుకెళుతున్న వైనాన్ని గుట్టు రట్టు చేశారు . నిందితుడు తో పాటు అతని గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి 40 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏటీఎంలలో పెట్టే డబ్బు నొక్కేసిన సిబ్బంది రాచకొండ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. కరూర్ వైశ్యా బ్యాంకు వ్రైటర్ సేఫ్ గార్డు కంపెనీకి ఎటీఎంలలో నగదు నింపే పని సబ్ కాంట్రాక్ట్ అప్పగించారు. అయితే నాగారంలోని ఏటీఎంలో నగదు లావాదేవీలు అవకతవకలు కనిపించాయి. 47లక్షలు నగదు తక్కువగా వస్తుందని ఎన్.సీ.ఆర్. కార్పొరేషన్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు మొదలు పెట్టిన కీసర పోలీసులు నాగారంలోని ఏటీఎం లో గల సీసీ పూటేజీ తో పాటు మరికొన్ని సైంటిఫిక్ ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. వ్రైటర్ సేఫ్ గార్డ్ కు చెందిన ఉద్యోగి , యాప్రాల్ కు చెందిన సాయికిరణ్ పై పోలీసులు అనుమానించారు. ఆ ఏటీఎంలో నగదును అప్లోడ్ చేయడం సాయిరామ్ చేసేవాడు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఏటీఎం లో నగదు లోడ్ చేయడం ఆ తర్వాత దర్జాగా తిరిగి వచ్చి డూప్లికేట్ కీ సహాయంతో ఏటీఎంలో నగదు తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. అతని నుండి 40 లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories