Top
logo

మోహన్‌బాబుకు బెదిరింపు కాల్స్‌

మోహన్‌బాబుకు బెదిరింపు కాల్స్‌
X
Highlights

ప్రముఖ సినీయర్ నటుడు మోహన్‌బాబు ఇటివలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీర్థంపుచ్చుకున్న విషయం...

ప్రముఖ సినీయర్ నటుడు మోహన్‌బాబు ఇటివలే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో తీర్థంపుచ్చుకున్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలోనే తాను వైసీపీ గూటికి చేరిన దగ్గరనుంచి బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయంటూ నటుడు మోహన్‌బాబు బంజారా హిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గత నెల 26న పలు నెంబర్ల నుండి ఫోన్‌ కాల్స్‌ వచ్చినట్టుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసుల దర్యప్తులో ప్రాథామిక విచారణ తరువాత ఆ కాల్స్‌ విదేశాల నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయ సలహా కోసం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా పోలీసులు వెల్లడించారు.

కాగా చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ నటుడు మోహన్‌ బాబుకు బెయిల్‌ లభించింది. ఎర్రమంజిల్‌ కోర్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది. తొలుత చెక్‌బౌన్స్‌ కేసులో ఏ-1గా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, ఏ-2గా మోహన్‌బాబును దోషులుగా తేల్చిన కోర్టు రూ. లక్షా 25 వేలు జరిమానా విధించిన విషయం తెలిసిందే.

Next Story