తెలంగాణపై పొగమంచు ప్రభావం

తెలంగాణపై పొగమంచు ప్రభావం
x
Highlights

ప్రకృతి అందాన్ని మరింత పెంచే పొగమంచు తెలంగాణలో దట్టంగా కురుస్తోంది. రాత్రి నుంచి ఉదయం వరకు పోగమంచు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా మంచు మాత్రం అధికస్థాయిలో కురుస్తోంది.

ప్రకృతి అందాన్ని మరింత పెంచే పొగమంచు తెలంగాణలో దట్టంగా కురుస్తోంది. రాత్రి నుంచి ఉదయం వరకు పోగమంచు తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదవుతున్నా మంచు మాత్రం అధికస్థాయిలో కురుస్తోంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి విదర్భ, మధ్యప్రదేశ్‌ మీదుగా రాజస్థాన్‌ వరకూ ఉపరితల ద్రోణి ప్రభావం ఉందని దీంతో పాటు ఉత్తర కోస్తాంధ్ర నుంచి విదర్భ వరకూ తుపాను వ్యతిరేక గాలులు వీస్తున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి తోడు బంగాళాఖాతం నుంచి తెలంగాణ వైపు వీస్తున్న తేమ గాలుల ప్రభావం కూడా ఉందని తెలిపారు. దీనివల్ల గాలిలోని తేమ నీటి బిందువులుగా మారి మంచులా కురుస్తోందని వివరించారు.

కొన్ని ప్రాంతాల్లో గాల్లోని తేమ శాతం 90 శాతాన్ని మించి ఉంటుందని ఆయా చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయిలో నమోదవడంతో పాటే తీవ్రంగా పొగమంచు కురుస్తుందని చెబుతున్నారు. దీని ప్రభావంతో హైదరాబాద్‌, చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మంచులో కూరుకుపోయినట్లు కనిపిస్తున్నాయి. ఇటు వాహనదారులు అయితే భయపడుతున్నారు. జాతీయరహదారుల్లో అయితే పొగమంచు కారణంగా నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. పలువురు గాయాలపాలవుతున్నారు. మరోవైపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 14, మెదక్‌లో 15, నల్గొండలో 16, హైదరాబాద్‌లో 17 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదే తరహా వాతావరణం ఆది, సోమవారాల్లో కూడా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories