తెలంగాణ వెరీ 'గుడ్డు'

తెలంగాణ వెరీ గుడ్డు
x
Highlights

గుడ్డు ఈ పేరు చెబితేనే నోరూరని వారు ఉండరు. తినాలనే కోరిక అందరికి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరు కోడిగుడ్డు తింటారు. కోడిగుడ్లు తినడంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది.

గుడ్డు ఈ పేరు చెబితేనే నోరూరని వారు ఉండరు. తినాలనే కోరిక అందరికి ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతీ ఒక్కరు కోడిగుడ్డు తింటారు. కోడిగుడ్లు తినడంలో దేశంలోనే తెలంగాణ టాప్ ప్లేస్ లో ఉంది. ఇది మేం చెబుతున్న మాట కాదు సాక్షాత్తు నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కమిటీ నివేదిక ఇచ్చింది.కోడి గుడ్డు శాఖాహరమో మాంస హారమో అన్న కన్ఫ్యూజన్ కు ఇంకా తెరపడలేదు కానీ గుడ్డును ఆరగించే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుంది. భోజనంలో అంచుకు బాయిల్డ్ ఎగ్ ఉంటే బాగు అదే ఆమ్లెట్టు అయితే మరీ సూపర్ ఇంకా బిర్యానీ, కర్రీ, బజ్జీ ఫ్రైడ్ రైస్ ఇలా ఏ రూపంలోనూ గుడ్డు ఉంటే ఓ ముద్ద ఎక్కువ తింటారు. గుడ్డులో మాంసకృత్తులు సమృద్ధిగా ఉండడంతో కండరాల నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుందన్నది చాలామంది బలంగా నమ్ముతారు. తొమ్మిది రకాల ప్రొటీన్లు కోడిగుడ్డులో ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో ఒక గుడ్డుకు మాత్రమే బయోలాజికల్ విలువ నూటికి నూరు శాతం ఉంటుందంటున్నారు ఆహార పరిశోదకులు.

దేశ వ్యాప్తంగా కోడిగుడ్ల వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. రాష్ర్టంలో కోడిగుడ్ల తలసరి వినియోగం ఏడాదికి 180 అని తేలింది. ఇది జాతీయ పౌష్టికాహార సంస్థ చెప్పిన తలసరి వినియోగానికి సమానం అని కూడా వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రోజుకు 22 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతుండగా తెలంగాణ వాట కింద 3.2 కోట్లు అని నేషనల్‌ ఎగ్‌ కో-ఆర్డినేషన్‌ కమిటీ వర్గాలు తెలిపాయి. తెలంగాణలో రోజుకు 1.7 కోట్ల కోడిగుడ్లు వినియోగిస్తున్నారు. కోడిగుడ్ల వినియోగం ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోనే ఉందని తేలింది.తెలంగాణ ప్రజల్లో మాంసాహార ప్రియులు ఎక్కువగా ఉంటారు. అందుకే బ్రేక్ ఫాస్ట్ మొదలు కొని రాత్రి భోజనం వరకు గుడ్డును ఎక్కువగా తింటుంటారు. ఆరోగ్యానికి గూడా చాలా బలవర్దకమైన ఆహారంగా గుడ్డును తీసుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories