ఈ పోలింగ్ స్టేషన్ స్పెషల్ గురూ!

ఈ పోలింగ్ స్టేషన్ స్పెషల్ గురూ!
x
Highlights

దూరం నుంచి చూస్తే అక్కడ ఏదైనా వేడుక జరుగుతుంది అననుకుంటారు. దగ్గరగా వెళితే ఆశ్చర్యం తో నోరు వేళ్ళ బెట్టేస్తారు. రంగుల బెలూన్లతో స్వాగత ద్వారం....

దూరం నుంచి చూస్తే అక్కడ ఏదైనా వేడుక జరుగుతుంది అననుకుంటారు. దగ్గరగా వెళితే ఆశ్చర్యం తో నోరు వేళ్ళ బెట్టేస్తారు. రంగుల బెలూన్లతో స్వాగత ద్వారం. సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాల్, విలాసవంతంగా కనిపించే కుర్చీలు, సోఫాలూ.. చల్లని మంచి నీరు.. పిల్లలకు పాలూ బిస్కట్లు.. లగేజీ దాచుకునే లాకర్లు.. ఈ లిస్ట్ అంతా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న ఓ పోలింగ్ బూత్ లో సౌకర్యాల లిస్ట్.


ఎండలో నిలబడి.. మంచినీరు కూడా లేకుండా దాహంతో గొంతు ఆర్చుకుపోతుండగా వెళ్లి ఓటేయడం మనకి తెలిసింది కానీ.. మధ్యప్రదేశ్ ఇండోర్ లో ఓ పోలింగ్ కేంద్రం పోలింగ్ కోసం పెళ్లి కుటీరం లా ముస్తాబయింది. ఇండోర్ మేనేజిమెంట్ అసోసియేషన్, నగరపాలక సంస్థ, అధికార యంత్రాంగం సహకారంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలతో పోలింగ్ కేంద్రాలకు వచ్చే వారి కోసం కిడ్స్ జోన్, తమ వస్తువులను దాచుకునేందుకు సేఫ్టీ లాకర్, ప్రమాదం జరిగితే ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్, శుద్ధమైన తాగునీరు, టీ, కాఫీ, శీతలపానీయాలు, తినేందుకు బిస్కెట్లు.. ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అంతేకాదు, దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. సకల సౌకర్యాలు కలిగిన ఈ పోలింగ్‌బూత్‌లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అబ్బా అన్ని పోలింగ్ కేంద్రాలూ ఇలానే చేస్తే వంద శాతం ఓటింగ్ నమోదు కాదూ!

Show Full Article
Print Article
Next Story
More Stories