వర్ధమాన నటిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్‌కు జీవిత ఖైదు

వర్ధమాన నటిపై అత్యాచారం.. క్యాస్టింగ్ డైరెక్టర్‌కు జీవిత ఖైదు
x
Highlights

వర్ధమాన నటి, మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.1.31 లక్షల జరిమానా విధించింది. ఇందులో లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారం కింద చెల్లించాలని, మిగతా సొమ్మును కోర్టులో కట్టాలని ఆదేశించింది.

వర్ధమాన నటి, మోడల్‌పై అత్యాచారం చేసిన కేసులో క్యాస్టింగ్ డైరెక్టర్‌కు ముంబై సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.1.31 లక్షల జరిమానా విధించింది. ఇందులో లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారం కింద చెల్లించాలని, మిగతా సొమ్మును కోర్టులో కట్టాలని ఆదేశించింది. సినిమాల్లో చాన్స్ కోసం ప్రయత్నిస్తున్న మహారాష్ట్ర నాసిక్ లోని సపుతారాలో మోడల్ కు క్యాస్టింగ్ డైరెక్టర్‌ ఘోష్ 2011 లో పరిచయమయ్యాడు. టీవీ కార్యక్రమాలను ప్రొడ్యూస్ చేస్తుంటానని చెప్పాడు. నటనపై తనకున్న ఇష్టాన్ని మోడల్ చెప్పింది.

ఓ టీవీషో కు మోడల్ ను ఘోష్ తీసుకెళ్లాడు. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఫిబ్రవరి 2012లో మధ్ ఐలండ్‌లో ఆమెపై అత్యాచారం చేసి ఫొటోలు తీశాడు. వాటిని చూపించి ఆ తర్వాత పలుమార్లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె నిరాకరిస్తే ఆ ఫొటోలను ఆమె భర్తకు పంపుతానని బెదిరించేవాడు.

ఘోష్ వేధింపులు భరించలేక మోడల్ స్వస్థలం సపుతారా వెళ్లిపోయింది. తిరిగి 2012 డిసెంబర్ లో ముంబైకి తిరిగి వచ్చింది. అప్పటికి ఆమె గర్భవతి. ఆమె ఇంటికి వచ్చిన ఘోష్ వేధింపులు ఆగాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ప్రసవం తర్వాత డబ్బులు ఇస్తానని ఆమె చెప్పింది.

2013లో మోడల్ తన ఫోన్ నంబరును మార్చేసింది. దీంతో మోడల్ అభ్యంతరకర ఫొటోలను ఆమె పనిచేస్తున్న సంస్థ యజమానితో పాటు భర్తకు పంపించాడు. ఫోటోలు చూసి భార్యను భర్త వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వీరికి ఓ బాబు ఉన్నాడు. మోడల్ ఫిర్యాదు మేరకు ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు విచారించిన ముంబై సెషన్స్ కోర్టు ఘోష్ కు జీవిత ఖైదు విధించింది. దీంతోపాటు రూ.1.31 లక్షల జరిమానా విధించింది. ఇందులో లక్షల రూపాయలను బాధితురాలికి పరిహారం కింద చెల్లించాలని, మిగతా సొమ్మును కోర్టులో కట్టాలని నిందితుడికి ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories