వర్షాకాలంలో భయపెడుతోన్న పాములు

వర్షాకాలంలో భయపెడుతోన్న పాములు
x
Highlights

కాటేసే సీజన్‌ వచ్చేసింది. పొదల చాటున ఏ గట్టు చాటునో మాటేస్తున్నాయి. చిరుజల్లుల మాటున కొత్త బెడద ఎదురవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న కాలి పిక్కపై...

కాటేసే సీజన్‌ వచ్చేసింది. పొదల చాటున ఏ గట్టు చాటునో మాటేస్తున్నాయి. చిరుజల్లుల మాటున కొత్త బెడద ఎదురవుతోంది. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్న కాలి పిక్కపై బలంగా పొడిచేస్తోంది. ఏ ముళ్లో, సూదో గుచ్చుకుందులే అని లైట్‌గా తీసుకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వర్షాకాలంలో హల్‌చల్‌ చేస్తున్న పాములపై స్పెషల్‌ స్టోరీ.

వానాకాలంలో పాములు పడవిప్పుతున్నాయి. స్వేచ్ఛగా తిరుగుతూ వానల చాటున మనుషులను కాటేస్తున్నాయి. ఓవైపు విషజర్వాలు మరోవైపు ప్రాణాలు తీస్తున్న పాములతో జనం భయాందోళన చెందుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిప్రవహించి పొలాల్లోను, ఇళ్లలోని నీరు చేరడంతో వాటితో విష సర్పాలు కూడా కొట్టుకొచ్చి ఆవాసాలుగా చేసుకున్నాయి. పిచ్చిచెట్లు, ఇతర మొక్కలు విపరీతంగా పెరిగి పరిసరాలను కమ్మేస్తున్నాయి. దీంతో బుసలు కొడుతూ పాములు పడగ విప్పి జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి .

వానలు పడినప్పుడల్లా పొడి ప్రదేశం కోసం వెతుకుతున్న పాములకు మనుషులు ఎదురయ్యేసరికి భయంతో టపీమని కాటేసిపోతాయి. దీంతో సగం విషంతో.. మరో సగం భయంతో వణికిపోయి ప్రాణాలొదిలేస్తున్నారు జనం. పాము కాటుతో ఆస్పత్రుల్లో మరణిస్తున్నవారి సంఖ్య వేలలో ఉంటే... పదుల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వర్షాకాలంలోఉస్మానియా గాంధీ ఆస్పత్రుల్లో వేలసంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయంటే పరిస్థితి ఏంటో అర్థమైపోతుందిపాము కాటులో ఆస్పత్రిలో చేరే బాధితులకు విరుగుడు మందులు లేక ఇబ్బందులు పడుతున్నారు. యాంటీ- వీనమ్, యాంటీ బయోటిక్​ఇంజెక్షన్ ​ సర్కారు ఆస్పత్రుల్లో లభించకపోవడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఆస్పత్రిలో చేర్పించే లోపే కొంతమంది ప్రాణాలు పోతున్నాయి.

మరోవైపు మూఢనమ్మకాల కారణంగా... ప్రజలు ఆస్పత్రులకు పోకుండా మంత్రగాళ్లను, నాటువైద్యులను ఆశ్రయిస్తున్నారు. పాము కాటేయగానే ఆందోళన చెందకుండా.. ప్రశాంతంగా ఉండటంతో పాటు వెంటనే ఆస్పత్రికి బయలుదేరాలని వైద్యులు చెబుతున్నారు. మొత్తానికి వర్షాకాలంలో జనానికి పాములతో కంటిపై కునుకులేకుండాపోతోంది. ఎప్పుడు ఎవరు పాము కాటుకు గురవుతారోనని భయపడుతున్నారు. పాములు కాటేయకుండా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పలువరు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories