విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాలు

విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిన తెలుగు రాష్ట్రాలు
x
Highlights

♦ విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారింపు. ♦ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలులో తలెత్తుతున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షిస్తున్నారు. ♦ ఇక రెండు రాష్ట్రాల మధ్య పీటముడిలా మారిన మరో అంశం ఆప్మేల్ విభజన

విభజన సమస్యల పరిష్కారంపై తెలుగు రాష్ట్రాలు దృష్టి సారించాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అమలులో తలెత్తుతున్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కారం చేసుకోవాలని ఇరు రాష్ట్రాల సీఎంలు ఆకాంక్షిస్తున్నారు. అయితే 9వ షెడ్యూల్ లోని పలు కంపెనీలు, కార్పోరేషన్ల విభజన మాత్రం కష్టసాధ్యంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చేసుకోని అభివృద్ది వైపు పరుగులు పెట్టాలని ఇరు రాష్ట్రాల సీఎంలు స్పష్టమైన నిర్ణయానికి వచ్చారు. అయితే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో 9 మరియు 10 షెడ్యూల్ లోని ఆస్తుల పంపకాల్లో సాంకేతికమైన అంశాలు, ఆర్థిక పరమైన వ్యవహారాలు దాగి ఉండటంతో పలు కంపెనీలు, సంస్థల విభజన పూర్తి అయినా మిగిలిన వాటిపై చర్చలు కొనసాగిస్తున్నారు.

విభజన తర్వాత ఆస్థులు, అప్పులు విభజనలో 9వ షెడ్యూల్‌లోని 91 కంపెనీలు, కార్పొరేషన్లు, 10వ షెడ్యూల్‌లోని 147 శిక్షణ సంస్థలు ఉన్నాయి. అయితే 10 వ షెడ్యూల్ లో దాదాపు అన్నింటిపై ఒక క్లారటీ వచ్చింది.. ఏ రాష్ట్ర ఉన్న ఆఫీసులు, శిక్షణా సంస్థలు ఆ రాష్ట్రానికే చెందుతాయని విభజన చట్టం స్పష్టం చేసిన నేపధ్యంలో వివాదం లేదు.. ఇక 9వ షెడ్యూల్ లో 91 అంశాల్లో 40 అంశాలు పరిష్కారం అయానా మిగిలిన 51 అంశాలు ఆర్థికంగా ముడిపడి ఉండటంతో విభజన అంత త్వరగా అయ్యేలా కనిపించడం లేదు.

ఈ సంస్థల విషయంలో హెడ్ క్వార్టర్ నిర్వచనం వివాదంపై రెండు రాష్ట్రాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ వివాదం పరిష్కారం కోసం షీలాబిడే కమిటీ చేసిన సిఫార్సులుపై తెలంగాణ ప్రభుత్వం సంతృప్తిగా లేదు.. కానీ ఏపీ ప్రభుత్వం 40 సంస్థల ఆస్తులు, అప్పుల విభజన కోసం జీవోలు జారీ చేసింది.. ఈ దిశలో తెలంగాణా కూడా స్పందించాలని ఏపీ కోరింది.. ఇక 9వ షెడ్యూల్లోని మరో సంస్థ ఏపీఎస్‌ఎఫ్‌సీ పైన కూడా రాబోయే రెండు రాష్ట్రాల సమావేశంలో చర్చ జరగనుంది.

ఇక రెండు రాష్ట్రాల మధ్య పీటముడిలా మారిన మరో అంశం ఆప్మేల్ విభజన. ఆప్మేల్‌ను 58-42 నిష్పత్తిలో విభజించాలని ఏపీ వాదిస్తోంది. తెలంగాణా ప్రభుత్వరంగ సంస్థగా ఉన్న సింగరేణి ఆస్తుల్లో ఏపీ వాటా అడగడం న్యాయం కాదని తెలంగాణ అధికారులు అంటున్నారు. సమస్య కొలిక్కిరాకపోతే, న్యాయస్థానంలో తెలంగాణాకు కచ్చితంగా న్యాయం జరుగుతుందనే విశ్వాసాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. ఇక షెడ్యూల్ 10 సంస్థల అంశం పంపకం చేయాలని ఏపీ ఏపీ పట్టుబడుతోంది. మొత్తానికి విభజన సమస్యలు పరిష్కారంలో 9 వ షెడ్యూల్ లని 51 అంశాల్లో ఉన్నా పలు కంపెనీలు, కార్పోరేషన్ల విభజన పై అధికారులు తీవ్రంగా మోధోమధనం చేస్తూన్నారు.ఈ సారి కేంద్ర హోం మంత్రిత్వశాఖలో జరిగే మీటింగ్‌లో ఈ అంశలే కీలకంగా ఉండబోతున్నాయి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories