తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల
x
Highlights

తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ను విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పరీక్షలను మే నెలలోనే నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ను రూపొందించారు.

తెలంగాణలో ఎంసెట్ షెడ్యూల్‌ను విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్ పరీక్షలను మే నెలలోనే నిర్వహించేలా అధికారులు షెడ్యూల్ ను రూపొందించారు. మే 3 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ మార్నింగ్ సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6వరకూ సెకండ్ షెషన్ నిర్వహించనున్నారు. ఇక దీనితో పాటు మే 11న ఈసెట్, 20న పీఈసెట్, 23,24వ తేదీల్లో ఐసెట్, 26న లాసెట్, పీజీ లాసెట్, 27 నుంచి 29 వరకు పీజీ ఈసెట్, మే 30, 31 తేదీల్లో ఎడ్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే విడుదల కానున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories