పండుగకు టోల్‌ ఫీజులు రద్దు

పండుగకు టోల్‌ ఫీజులు రద్దు
x
Highlights

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణలోని జాతీయ రహదారులపై రెండ్రోజుల పాటు టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది.

సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో తెలంగాణలోని జాతీయ రహదారులపై రెండ్రోజుల పాటు టోల్ గేట్ల దగ్గర ఫీజు వసూలు చేయొద్దని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. 13, 16 తేదీల్లో టోల్ ఫీజును రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అటు ఏపీలోని జాతీయ రహదారులపై ఇప్పటికే 4 రోజుల పాటు టోల్ ఫీజు రద్దు చేస్తున్నట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. 12, 13, 16, 17 తేదీల్లో టోల్ ఫీజు వసూలును రద్దు చేస్తున్నట్లు తెలిపింది. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా నగరవాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో టోల్‌ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసినా వాహనాలు చాలా నెమ్మదిగా కదులు తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణికుల అక్కట్లను దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం 4 రోజుల పాటు, తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల పాటు టోల్ గేట్ ఫీజు రద్దు చేశాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories