తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో సెంటర్

తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో సెంటర్
x
Highlights

మొన్నటి మొన్న తెలంగాణ వెలువడిన ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై 26 మంది విద్యార్థుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారు. ఫలితాల అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా...

మొన్నటి మొన్న తెలంగాణ వెలువడిన ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై 26 మంది విద్యార్థుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్నారు. ఫలితాల అవకతవకలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో పొరపాటే శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ తన తప్పులను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు చేసిన తప్పుల వల్ల విద్యార్థులపై తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణలో ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న ఒక ఇంటర్ విద్యార్థికి మైండ్ బ్లాంక్ అయింది. ఎంసెట్ హాల్ టికెట్‌ను తీసుకున్న ఆ విద్యార్థిని పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందని చూసే సరికి కళ్లు బైర్లు కమ్మింనంతా పనైంది ఆ విద్యార్థినికి. ఇక అసలు విషయానికి వొస్తో మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎం శ్రావ్య అనే విద్యార్థిని హాల్ టికెట్ (1913k03435)ను తీసుకుంది.

అయితే ఆమెకు పరీక్షా కేంద్రాన్ని మాత్రం తెలంగాణలో పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో వేశారు. ఈ విద్యార్థికి కర్నూలు జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. అయితే పాపం ఆ విద్యార్థిని మాత్రం తనకు కర్నూల్ జిల్లాలోనే పరీక్షా కేంద్రాన్ని ఇవ్వలని ఆప్షన్ కూడా పెట్టలేదు. తెలంగాణ ఎంసెట్‌ను ఏపీలో ఎలా రాయాలో అర్థం కాక ఆ విద్యార్థిని జుట్టు పీక్కుంటున్నారు. కాగా విద్యార్థికి మే 9న తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఉంది. అయితే విద్యార్థి పరీక్షా కేంద్రాన్నిమార్చడానికి ఇంకా ఐదురోజుల సమయమే మాత్రమే మిగిలి ఉంది. ఇలోపు కరెక్షన్ జరగకపోతే ఆ విద్యార్థి భవిష్యత్తే అంధకారంలో పడుతుంది. విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల ఇలా విద్యార్థుల భవిష్యత్ అంధకారమయ్యే పరిస్థితి తలెత్తుతోంది. కాగా ఇప్పటికైన విద్యార్థి హాల్ టికెట్‌ను బోర్డు మార్చాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories