రైతుబంధు : రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు

రైతుబంధు : రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు
x
Highlights

ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన అలస్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను...

ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన అలస్యంతో రైతులు నష్టపోకుండా చూడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం నుండి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాలలోకి రైతుబంధు డబ్బులు జమ అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు రైతుబంధు డబ్బులు జమచేశామని, రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు...సహకార సంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలుచేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించామని, రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని నిరంజన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేశామని ఆయన తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories