Top
logo

పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ

పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ
Highlights

పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. రిజర్వేషన్ల వివరాలు పంచాయతీరాజ్ శాఖ ఈసీకి పంపించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం 50కోట్లు విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ను జనవరి 3 లేదా 4 తేదీల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఈసీ.

పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. రిజర్వేషన్ల వివరాలు పంచాయతీరాజ్ శాఖ ఈసీకి పంపించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం 50కోట్లు విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ ను జనవరి 3 లేదా 4 తేదీల్లో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేసింది ఈసీ. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు అంతా రెడీ అవుతోంది. మొత్తం 12,751 పంచాయతీల్లో 1,281 షెడ్యూల్ ప్రాంతాలకు, వందశాతం ఎస్టీ జనాభా ఉన్న 1,177 పంచాయతీలను వారికే కేటాయించింది. నాన్ షెడ్యూల్ ఏరియాలో ఎస్టీలకు 688, ఎస్సీలకు 2,113, బీసీలకు 2,345, జనరల్ కు కలిపి 10,293 పంచాయతీల్లో రిజర్వేషన్లు ప్రకటించింది. 50శాతం అంటే 6, 378 పంచాయతీలను మహిళలకు కేటాయించారు. రిజర్వేషన్ల ప్రకటన వెలువడటంతో ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు , వంద శాతం ఎస్టీలకు కేటాయించిన పంచాయతీలు పోను మిగిలిన పంచాయతీల్లో బీసీలకు 2,345, ఎస్సీలకు 2,113, ఎస్టీలకు 688 పంచాయతీలు కేటాయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం 50శాతానికి మించకుండా రిజర్వేషన్ల కేటాయింపు పూర్తి చేశారు. రాష్ట్రం యూనిట్ గా సర్పంచి, గ్రామం యూనిట్ గా వార్డుల విభజన ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని ప్రక్రియ పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 50 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేయగా ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల, ఏర్పాట్లపై బిజిగా ఉంది.

Next Story

లైవ్ టీవి


Share it