ప్రవాసీయులను ఆకర్షిస్తో గ్రామ సర్పంచ్ ఎన్నికలు

ప్రవాసీయులను ఆకర్షిస్తో గ్రామ సర్పంచ్ ఎన్నికలు
x
Highlights

గ్రామ సర్పంచ్ పదవికి ఉన్న క్రేజీ ప్రవాసీయులను ఆకర్షిస్తోంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఇప్పటికే తమ తమ గ్రామాల్లో వాలిపోయారు.

గ్రామ సర్పంచ్ పదవికి ఉన్న క్రేజీ ప్రవాసీయులను ఆకర్షిస్తోంది జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలానికి చెందిన ఇద్దరు యువకులు ఇప్పటికే తమ తమ గ్రామాల్లో వాలిపోయారు. అశోక్, రమేష్ అనే యువకులు తమ గ్రామానికి చేరుకుని ఎన్నికల బరిలో తమ వారిని నిలిపేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దుంపేట గ్రామానికి చెందిన రమేష్ గతంలో దుంపేట గ్రామంలోనే ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేశాడు. మూడేళ్ళ క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లాలని అక్కడ ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నానని రమేష్ తెలిపాడు. నెలకు యాబై వేల రూపాయల వరకు సంపదిస్తానని చెబుతున్న రమేష్ దుంపేట స్థానం ఎస్సీ సామాజిక వర్గం మహిళకి కేటాయించినందున తన భార్యని పోటీ చేయిస్తున్నట్లు తెలిపాడు.

ఇప్పపల్లి గ్రామానికి చెందిన యాగండ్ల అశోక్ సౌదీ లో డ్రైవర్ గా పనిచేస్తూ, నెలకు అరవై వేల నుండి డెబ్భై వేల రూపాయల దాకా వేతనం పొందుతున్నని చెప్పాడు. గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న కొలువును వదులుకొని గల్ఫ్ నుంచి వచ్చానని చెప్పాడు. తమ గ్రామంలో ఉన్న నీటి సమస్యలు, మురికి కాలువ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం పోటీలో నిలుస్తున్నానని తెలిపాడు. ఇప్పుపల్లి కి జనరల్ మహిళను కేటాయించడం వల్ల నేను కాకుండా నా భార్య అయిన కుమారిని పోటీ చేయిస్తానని, భారీ మెజారిటీతో గెలిపించుకుని, ప్రజలకు సేవ చేస్తానని తెలిపాడు. పక్క జిల్లాలు, రాష్ట్రాల్లో పనిచేసుకుంటున్న వారు కాదు, ఏకంగా గల్ఫ్‌లో పనిచేస్తోన్న వారే సర్పంచ్‌గా పోటీ చేయడానికి స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నారంటే సర్పంచ్ ఎన్నికలకు ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories