తెలంగాణలో భారీగా పెరిగిన కొత్త ఓటర్లు

తెలంగాణలో భారీగా పెరిగిన కొత్త ఓటర్లు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితా మూడు కోట్ల‌కు చేరువైంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే 24 ల‌క్ష‌లు అదనంగా కొత్త ఓటర్లు పెరిగారు. రానున్న...

తెలంగాణ రాష్ట్రంలో ఓట‌ర్ల జాబితా మూడు కోట్ల‌కు చేరువైంది. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే 24 ల‌క్ష‌లు అదనంగా కొత్త ఓటర్లు పెరిగారు. రానున్న పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం మ‌రో నాలుగు రోజుల పాటు జ‌రిగే ప్ర‌త్యేక డ్రైవ్ ద్వారా ఈ సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. మొదటి సారి ఓటు వేసే వారి సంఖ్య ఈ సారి ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఆరోపణలు, కోర్టు వివాదాలను దృష్టిలో పెట్టుకొని పార్ల‌మెంట్ ఎన్నిక‌ల కోసం తెలంగాణ ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఓటర్ల నమోదు కార్యక్రమం గడువు తగ్గించి విమర్శలు ఎదుర్కున్న ఈసీ ఈ సారి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ల సంఖ్యను పెంచింది. ఫిబ్రవరి నుంచి 23 ప్రత్యేక డ్రైవులు నిర్వహించిన అధికారులు దాదాపుగా 24 ల‌క్ష‌ల కొత్త ఓటర్లను చేర్చారు.

ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 95 లక్షల18 వేల 976 మంది ఓటర్లున్నారు. వీరిలో 19 లక్షల 15వేల 240 మంది కొత్తగా నమోదయ్యారు. రాష్ట్రంలో రెండుచోట్ల ఓటు హక్కు ఉన్న 1 లక్ష 95 వేల 369 మంది ఓట్లను తొలిగించారు. మరణించినా జాబితాలో పేరున్న 44 వేల721 మంది ఓటర్లను జాబితా నుంచి తీసివేశారు. గత అసెంబ్లీ ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ సారి గణనీయంగా ఓట‌ర్లు సంఖ్య పెరిగింది. 24 లక్షల మంది ఓటర్లు పెరిగారని ఈసీ తెలిపారు. ఇందులో కొత్తగా ఓటు నమోదు చేసుకున్న ఓటర్లే ఎక్కువ ఉన్నారని తెలుస్తోంది. ఓటుహక్కు నమోదు కార్యక్రమం ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ జాబితా పెరిగే అవకాశం ఉంది.

ఈ సారి జాబిత‌లో గతంలో పోలిస్తే రాష్ట్రంలో ప్రజలు ఓటర్ల రేషియో పెరిగిన‌ట్లు తెలుస్తుంది. ఇదివరకు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మందికి 738 మంది ఓటర్లుండగా. ప్రస్తుతం ఆ సంఖ్య 762కు పెరిగింది. అదేవిదంగా స్త్రీ, పురుషుల నిష్పత్తి కూడా పెరిగింది. గతంలో ప్రతి వెయ్యిమంది పురుషులకు 982 మంది మహిళా ఓటర్లుండగా. ప్రస్తుతం ఆ సంఖ్య 989కి పెరిగింది. మొత్తానికి గ‌త ఎన్నిక‌ల్లోనూ ఏకంగా హై కోర్టు తీర్పుతో లిస్ట్ ప్ర‌క‌టించిన అధికారులు. ఈ సారైన ఎలాంటి గందరగోళం లేకుండా చూడాలనుకుంటున్నారు.

తెలంగాణలో ఓటర్లు 2,95,18,976

కొత్తగా పెరిగిన 24లక్షల ఓటర్లు

పురుషులు 1,48,42,619

మహిళలు 1,46,74,977

Show Full Article
Print Article
Next Story
More Stories