తెలంగాణలో ఆలస్యంకానున్న మున్సిపల్ ఎన్నికలు

తెలంగాణలో ఆలస్యంకానున్న మున్సిపల్ ఎన్నికలు
x
Highlights

తెలంగాలో మున్సిపాల్ ఎన్నికలు అలస్యం కానున్నాయి. కొత్త మున్సిపాల్ చట్టం వచ్చిన తర్వాతే ఈ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అగస్టులో బిల్లు...

తెలంగాలో మున్సిపాల్ ఎన్నికలు అలస్యం కానున్నాయి. కొత్త మున్సిపాల్ చట్టం వచ్చిన తర్వాతే ఈ ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. అగస్టులో బిల్లు ఆమోదించి, సెప్టెంబర్ లో పురపాలక సంఘాల ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తోంది. తెలంగాణలో మున్సిపాలిటీల పదవీ కాలం జూలై లో ముగుస్తోంది. దీంతో జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించాలని తొలుత సీఎం కేసీఆర్ భావించారు. అయితే, ఇంకా కొత్త మున్సిపాల్ చట్టంపై కసరత్తు జరుగుతుండడంతో పురపాలక ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.

నూతన మున్సిపాల్ చట్టంలో అధికారుల విధులు, బాధ్యతల్లో మార్పులు చేయనున్నారు. పట్టణ ప్రణాళికలో పారదర్శకత కోసం నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. నిర్ణీత కాలవ్యవధిలో బిల్డింగ్‌ పర్మిషన్‌ రాకపోతే పర్మిషన్ మంజూరు అయినట్లు భావించేలా చట్టంలో వెసులుబాటు కల్పిస్తున్నారు. సకాలంలో ఫైల్ క్లియర్ చేయని ఉద్యోగులపై జరిమానా లేదా సస్పెండ్ చేస్తారు. పౌర సేవలన్నింటినీ ఆన్‌లైన్‌ చేయనున్నారు.

కొత్త మున్సిపల్ చట్టం ఇంకా పూర్తి కాకపోవడం, జూన్ లో మున్సిపాలిటీల ఎన్నికలు నిర్వహిస్తే తాగు నీటి సమస్యతో ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉందని టీఆర్ ఎస్ భావిస్తోంది. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు హడివిడి తగ్గిన తర్వాత మున్సిపాల్ చట్టంపై కేసీఆర్ దృష్టి సారించనున్నారు. అన్నీ కుదిరితే ఆగస్టులో కొత్త మున్సిపాల్ బిల్లును అసెంబ్లీ ఆమోదించి, సెప్టెంబర్ లో ఎన్నికలు నిర్వహిస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.


Show Full Article
Print Article
Next Story
More Stories