ముగిసిన పరిషత్ ఎన్నికలు...తుది విడతలో భారీగా పోలింగ్

ముగిసిన పరిషత్ ఎన్నికలు...తుది విడతలో భారీగా పోలింగ్
x
Highlights

తెలంగాణలో తుదివిడుత పరిషత్ ఎన్నికలు ముగిశాయి. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 205 పోలింగ్...

తెలంగాణలో తుదివిడుత పరిషత్ ఎన్నికలు ముగిశాయి. 161 జెడ్పీటీసీ, 1,738 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న 205 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తుది విడుతలో 27 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి.

తుది విడతలో 161 జెడ్పీటీసీ స్థానాలకు 741 మంది, 1,738 ఎంపీటీసీ స్థానాలకు 5,726 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో 30 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు మినహా పరిషత్‌ ఎన్నికల పోలింగ్ ప్ర్రశాంతంగా ముగిసింది.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికలు మొదటి విడతలో, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, వరంగల్ అర్బన్ జిల్లాల పోలింగ్ రెండోవిడుతలో పూర్తయింది. తొలి విడుతలో 76.80 శాతం, రెండో విడుతలో 77.63 శాతం పోలింగ్ నమోదైంది. మూడోది అయిన తుది విడత ఎన్నికల్లో కూడా భారీగా పోలింగ్ శాతం నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 70 పాయింట్ జీరో 5 శాతం పోలింగ్ జరిగింది. ఈనెల 27న పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories