గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు...మాటలకే పరిమితమవుతున్న కాంగ్రెస్ నేతలు

గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు...మాటలకే పరిమితమవుతున్న కాంగ్రెస్ నేతలు
x
Highlights

MPTC, ZPTC ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు అనుసరిస్తున్న విధానాలతో కేడర్‌ అసంతృప్తికి లోనవుతోందా ? ముఖ్యనేతలు నిర్వహిస్తున్న సమావేశాలు తూతూ మంత్రంగానే...

MPTC, ZPTC ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నేతలు అనుసరిస్తున్న విధానాలతో కేడర్‌ అసంతృప్తికి లోనవుతోందా ? ముఖ్యనేతలు నిర్వహిస్తున్న సమావేశాలు తూతూ మంత్రంగానే కొనసాగతుతున్నాయా ? పరిషత్ ఎన్నికల బాధ్యతలు ఇన్‌చార్జ్‌లకు అప్పగించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారా ? అంటే అవుననే సమాధానం జిల్లా నేతల నుంచి వినిపిస్తోంది.

తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు జరగుతున్న ప్రతి ఎన్నికను అధికార టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటే ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం ఢీలా పడుతోంది. గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేస్తోంటే కాంగ్రెస్ నేతలు మాటలకే పరిమితమవుతున్నారు. శాసనసభ, స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ఘోర పరాజయాలతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులను ఉత్తేజ పరిచేందుకు కనీస ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలను మూటగట్టకుంటున్నారు.

రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న మండల పరిషత్‌, జిల్లా పరిషత్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి పార్టీ శ‌్రేణులతో విస్త్రత స్ధాయి సమావేశం నిర్వహించారు. గెలుపే లక్ష్యంగా పోరాడాలంటూ దిశానిర్దేశం చేశారు. ఒక్క స్ధానం కూడా కోల్పోకుండా జాగ్రత్త పడాలంటూ సూచించారు. అధికార పార్టీ నేతలు ఈ స్ధాయిలో ప్రయత్నాలు చేస్తుంటే విపక్ష కాంగ్రెస్ మాత్రం అదిగో ఇదిగో అంటూ మాటలకే పరిమితమవుతోంది.

అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ ఎన్నికలను జిల్లా నేతలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకొవడంపై పార్టీలో భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. అసలే అధికారం లేక పార్టీ కార్యకర్తలు అవస్థలు పడుతుంటే పార్టీ ముఖ్యనేతలు కనీసం తామున్నమనే భరోసా కల్పించలేకపోతున్నారనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. వరుస పరాజయాలు ఎదురవుతున్నా గుణపాఠాలు నేర్చుకోకపోతే ఎలాగని ద్వితియ శ్రేణి నేతలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.

ఇంచార్జులను నియమించి చేతులు దులుపుకుంటే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అగ్రనేతలు మేల్కొని కేడర్‌లో కొత్త ఉత్సాహం నింపాలని కోరుతున్నారు. హైదరాబాద్‌ను వదిలి గ్రామాల్లో పర్యటిస్తే పార్టీకి మేలు జరుగుతుందంటూ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories