ఇంటర్ మూల్యాంకనం విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం

ఇంటర్ మూల్యాంకనం విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు ఆగ్రహం
x
Highlights

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు ఆందోళనలకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు...

ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై నిరసనలు కొనసాగుతున్నాయి. మూడోరోజు ఆందోళనలకు విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధమయ్యారు. బోర్డు కార్యదర్శి అశోక్ ఇచ్చిన వివరణకు సంతృప్తి చెందని విద్యార్థుల తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనలు జరుపుతున్నారు. విద్యార్థుల అరెస్టులు, రాజకీయ నేతల సంఘీభావం, విద్యార్థి సంఘాల నినాదాలు బోర్డు కార్యాలయం హోరెత్తుతున్నాయి. 25న కలెక్టరేట్ల ముందు ఆందోళనకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది.

ఇంటర్ బోర్డు వైఫల్యంపై నేతలు సర్కార్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. బోర్డు తీరుపై సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, చీఫ్ విప్ భట్టి విక్రమార్క లేఖ రాశారు. బోర్డు వైఫల్యానికి బాధ్యత వహించి విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు , బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు ఇంటర్ బోర్డు కార్యాలయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారించింది. బోర్డు కార్యదర్శి అశోక్‌తో పాటు, గ్లోబరీనా సంస్థ సీఈవో రాజులను ప్రశ్నించింది. గ్లోబరీనా సంస్థ లోపాలు, బోర్డు వ్యవహరించిన తీరుపై కమిటీ ప్రశ్నల వర్షం కురిపించింది. ఈమేరకు కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఇంటర్ బోర్డు ప్రక్షాళనకు సర్కార్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇంటర్ మూల్యంకనం విషయంలో ప్రభుత్వం తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సమస్యను ఎలా పరిష్కరిస్తారో వచ్చే సోమవారం నాటికి స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరుకావాలని విద్యాశాఖ కార్యదర్శి , ఇంటర్ బోర్డు కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories