కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు

కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
x
Highlights

కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లను...

కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. కాంగ్రెస్ నేతలు మల్‌రెడ్డి రంగారెడ్డితో పాటు ఉత్తమ్‌ పద్మావతి, ధర్మపురి లక్ష్మణ్‌లు దాఖలు చేసిన పిటిషన్‌లను హైకోర్టు విచారించింది. పోలైన ఓట్లకు, వీవీ పాట్ ఓట్లకు తేడా ఉందంటూ మల్‌రెడ్డి రంగారెడ్డి తరపు న్యాయవాది వాదించారు. తన క్లయింట్ ‌స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారని వీవీ పాట్‌ల ఓట్లకు పోలైన్ ఓట్ల భారీగా తేడా ఉందంటూ ఆయన వాదించారు. ఇదే సమయంలో ఇతరుల పిటిషన్లను కూడా విచారించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఈసీని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణ వచ్చే 14కు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories