నిజామాబాద్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

నిజామాబాద్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
x
Highlights

నిజామాబాద్ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల నుండి 7 అభ్యర్థులతో పాటు 178 మంది...

నిజామాబాద్ ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల బరిలో రాజకీయ పార్టీల నుండి 7 అభ్యర్థులతో పాటు 178 మంది రైతులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన సంగతి తెలిసిందే. నిజామాబాద్ స్వతంత్ర ఎంపీ అభ్యర్థుల పిటిషన్‌పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు ఎన్నికను వాయిదా వేయలేమని తేల్చిచెప్పింది. దీంతో నిజామాబాద్‌ ఎన్నికలపై నెలకొన్న ఉత్కంఠ ఎట్టకేలకు తొలగింది. అయితే ఇండిపెండెంట్స్‌కు ఇంకా గుర్తులు కేటాయించలేదని, ఎన్నికను వాయిదా వేయాలని పిటిషనర్‌ కోరడంతో కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు నోటీసులిచ్చిన హైకోర్టు తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని పేర్కొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories