మురికి కూపంగా మూసీ నది..

మురికి కూపంగా మూసీ నది..
x
Highlights

కాలుష్య వ్యర్థాలు, మానవ వ్యర్ధాలు , రసాయనాలు, దుర్వాసన, మురుగు నీరు కాలకూట విషం ఇదంతా మూసీ ప్రత్యేకతలు. మూసి అంటే ముక్కు మూసుకోవాల్సిందే. హైదరాబాద్...

కాలుష్య వ్యర్థాలు, మానవ వ్యర్ధాలు , రసాయనాలు, దుర్వాసన, మురుగు నీరు కాలకూట విషం ఇదంతా మూసీ ప్రత్యేకతలు. మూసి అంటే ముక్కు మూసుకోవాల్సిందే. హైదరాబాద్ మహానగరంలో ప్రవహించే మూసీ నది నగరవాసులకు దుర్వాసన వెదజల్లుతోంది. పారిశ్రామిక వ్యర్ధాలు మూసిని మురికి కూపంగా మారుస్తున్నాయి.

ఒకప్పుడు జీవ నది సాగు , తాగునీరు అందించిందీ మూసీ నది అంటే ఎవరు నమ్మరు. అప్పుడలా ఉన్న భాగ్యనగరం మూసీనది ఇప్పుడు మురికి కూపంగా మారింది. దుర్వాసన వెదజల్లుతోంది. దోమలకు నిలయమైంది. నగరంలోని 30కి పైగా నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతోంది. ప్రస్తుతం ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు మూసీలో కలుస్తోంది. అత్తాపూర్, అంబర్‌పేట, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో 600 మిలియన్ లీటర్ల మురుగును శుద్ధి చేస్తున్నారు.

గ్రేటర్ పరిధిలో మురికి నీటిని శుద్ధి చేసేందుకు జీహెచ్ఎంసీ ఇప్పటికే 400 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అయినా మురుగు తగ్గలేదు. సుందరీకరణ జరగలేదు. మురుగును మళ్లించడానికి ఏర్పాటు చేసిన పైపులైన్లు, ట్రీట్ ప్లాంట్స్ సరిగా పనిచేయకపోవడంతో సీవరేజ్ వాటర్ మూసీలోకి చేరుతుంది. మూసీ పరిరక్షణ, పరివాహక ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మురుగునీటిని అరికట్టడం, వాటిని శుద్ధి చేసి నదిలోకి వదలడం, నది వెంబడి పర్యాటక స్థలాలు అభివృద్ధి చేయడం, వాక్ వేలు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటు... గ్రీన్ స్పెస్, ఎకో టూరిజం కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మూసిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి అందమైన మూసిని అందుబాటులోకి తేవాలని సిటిజన్స్ కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories