మూతపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు

మూతపడుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు
x
Highlights

ఇంజనీరింగ్‌ కాలేజీలో హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఏటికిఏడు చేరి వారి సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న సంఖ్య ఇప్పుడు వేలకే ...

ఇంజనీరింగ్‌ కాలేజీలో హబ్‌గా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో ఏటికిఏడు చేరి వారి సంఖ్య తగ్గుతోంది. ఒకప్పుడు లక్షల్లో ఉన్న సంఖ్య ఇప్పుడు వేలకే పరిమితమైంది. కొత్త కోర్సులు రావడం ఇతర రాష్ట్రాల నుంచి విద్యార్ధుల రాక తగ్గిపోవడం ప్రస్తుత పరిస్ధితులకు అనుగుణంగా మార్పు రాకపోవడంతో వందలాది కాలేజీలు మూతపడే స్ధితికి చేరుకున్నాయి.

ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్యకు మూలకేంద్రంగా ఉన్న ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో లక్షలాది మందిఎంట్రన్స్‌ టెస్ట్‌లు రాస్తున్నా అడ్మిషన్లు మాత్రం వేలకు మించి కావడం లేదు. ఐటీ కారిడార్ రోజురోజుకు విస్తరిస్తున్నా ప్రపంచ స్ధాయి సంస్ధలు హైదరాబాద్‌నే ఎంచుకుంటున్నా ఆశించిన స్ధాయిలో విద్యార్ధుల సంఖ్య పెరగక పోవడంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు లబోదిబోమంటున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా జేఎన్‌టీయూ పరిధిలో 118 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా మరో వంద ఇతర యూనివర్సిటీల పరిధిలో ఉన్నాయి. వీటిల్లో రెండు లక్షల 30 వేల సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 52 శాతానికి మించి అడ్మిషన్లు కావడం లేదు. 2012-13లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 57 శాతంగా ఉన్న అడ్మిషన్లు ఇప్పుడు ఐదు శాతం మేర తగ్గాయి.

ఇంజనీరింగ్ కోర్సుల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు జేఎన్‌టీయూ రిజిస్టార్ యాదయ్య,. పూర్తి స్ధాయిలో ప్రమాణాలు లేని కాలేజీలను విద్యార్ధులు ఎంచుకోవడం లేదంటున్నారు. ప్రయివేటు కాలేజీలు మాత్రం ప్రభుత్వ తీరు వల్లే కాలేజీలు మూత పడే స్ధితికి వచ్చాయంటున్నారు. 10 వేల ర్యాంకు లోపు వారికే పూర్తి స్ధాయి ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించడం, ఇతరులకు నిబంధనల పేరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ తగ్గించడం వల్లే విద్యార్ధుల సంఖ్య తగ్గుతోందని స్టూడెంట్స్‌ చెబుతున్నారు.

ఎవరి కారణాలు ఎలా ఉన్నా ఇంజనీరింగ్‌‌లో చేరే వారి సంఖ్య భారీగా తగ్గిపోతూ ఉండటంతో కళాశాలల యాజమాన్యాలు మూసివేసేందుకే సిద్ధమవుతున్నాయి. అయితే ఈ పరిస్ధితి ఒక్క తెలంగాణకే పరిమితం కాలేదంటున్నారు విద్యానిపుణులు. దేశ వ్యాప్తంగా ఇంజనీరింగ్‌లో చేరే వారి సంఖ్య గడచిన ఆరేళ్లలో 64 శాతం నుంచి 50 శాతానికి తగ్గిందంటున్నారు .


Show Full Article
Print Article
Next Story
More Stories