ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. కొత్త అంశాలు ఇవే

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. కొత్త అంశాలు ఇవే
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌...

తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మూడు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌ జరగనుంది. మే 6, 10, 14 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో 538 జడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు మే 27న వెల్లడవుతాయని ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో పరిషత్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి ఎన్నికల తేదీల వివరాలను ప్రకటించారు. మొత్తం 538 జెడ్పీటీసీ, 5,817 ఎంపీటీసీ స్థానాలకు మూడు విడతల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ నాగిరెడ్డి చెప్పారు. అయితే, తొలి విడత ఎన్నికలు మే 6న, రెండో విడత ఎన్నికలు మే 10న, మూడో విడత ఎన్నికలు మే 14న నిర్వహిస్తామని నాగిరెడ్డి చెప్పారు. ఎంపీటీసీ అభ్యర్థులు గరిష్ఠంగా రూ.లక్షన్నర, జెడ్పీటీసీ అభ్యర్థులు రూ.4 లక్షలు ఖర్చు చేయవచ్చు. మే 27న ఓట్ల లెక్కింపు చేపడతామని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 40 ఎంపీటీసీ స్థానాలతో పాటు ములుగు జిల్లా మంగపేట జెడ్పీటీసీ స్థానానికి పోలింగ్‌ నిర్వహించడం లేదని నాగిరెడ్డి చెప్పారు. నేటి నుంచి కోడ్‌ అమలులోకి రానుందని చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణకు 32,042 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులు 4లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులకు లక్షా 50వేలు గరిష్ఠ వ్యయ పరిమితి విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలుపు రంగులో ఎంపీటీసీల బ్యాలెట్‌ పేపర్‌, గులాబీ రుంగులో జెడ్పీటీసీల బ్యాలెట్‌ పేపర్లు ఉంటాయని తెలిపారు.

అయితే, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈసారి ఆన్‌లైన్ విధానంలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఎన్నికల్లో మొత్తం 1,56,11,474 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 77,34,800 కాగా మహిళలు 78,76,361, ఇతరులు 313 మంది ఉన్నారు. పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు లక్షా 47వేల మంది సిబ్బందిని వినియోగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories