Top
logo

తెలంగాణలో హత్య కేసులు 4 శాతం తగ్గాయి: డీజీపీ

తెలంగాణలో హత్య కేసులు 4 శాతం తగ్గాయి: డీజీపీ
X
Highlights

తెలంగాణ రాష్ట్రంలో హత్య కేసులు 4శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ... తెలంగాణలో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్తి తగాదాలు 8 శాతం, చైన్‌ స్నాచింగ్‌లు 43 శాతం తగ్గాయని, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్‌ నేరాలు 3శాతం తగ్గాయన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో హత్య కేసులు 4శాతం తగ్గాయని డీజీపీ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ తెలంగాణలో 15 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆస్తి తగాదాలు 8 శాతం, చైన్‌ స్నాచింగ్‌లు 43 శాతం తగ్గాయని, మహిళలపై నేరాలు 7శాతం, సైబర్‌ నేరాలు 3శాతం తగ్గాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపుచేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం జిల్లా కేంద్రాల్లో భరోసా సెంటర్లు ఏర్పాటుచేశామని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు.

Next Story