కవితపై కోదండరాం పోటీ ? కాంగ్రెస్ సరికొత్త వ్యూహం

కవితపై కోదండరాం పోటీ ? కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
x
Highlights

తెలంగాణలో ఎన్నిక నగారా మోగిన విషయం తెలిసిందే కాగా లోక్‌సభ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేస్తోంది. అయితే ఇప్పటికే...

తెలంగాణలో ఎన్నిక నగారా మోగిన విషయం తెలిసిందే కాగా లోక్‌సభ అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ ముమ్మరం చేస్తోంది. అయితే ఇప్పటికే టీపీసీసీ నుంచి వచ్చిన జాబితాను హైకమాండ్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే సీనియర్ నేతలను ఎన్నికల రణరంగంలోకి దించాలని ఓ సీనియర్ నేత ఏఐసీసీకి లేఖ రాశారు. ఇక దీంతో కాంగ్రెస్ అధిష్టానం చర్చలు జరిపి టీకాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకులంతా కూడా లోక్‌సభ ఎన్నికలకు సిద్ధంకావాలని ఇప్పటికే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కోదండరాం ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలో దిగే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తోన్నాయి. జనసమితి పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని తాము పోటీలో లేని చోట కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. అయితే నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ కవిత ప్రాతినిథ్యం వహిస్తున్న నిజామాబాద్ నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎంపీ మధుయాష్కీ ఆసక్తి చూపడం లేదు. మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి కూడా నిజామాబాద్ నుంచి పోటీకి విముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ నుండి కోదండరాంను బరిలోకి నిలిపి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నట్టు ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు కోదండరాంతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే నిజామాబాద్ బరిలో నిలిచేందుకు కోదండరాం అంగీకరిస్తారా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories