డీకే అరుణ బాటలోనే..మరో 20మంది టీ.కాంగ్రెస్‌ నేతలు!

డీకే అరుణ బాటలోనే..మరో 20మంది టీ.కాంగ్రెస్‌ నేతలు!
x
Highlights

ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న సమయంలో ఆపరేషన్ కమలం దెబ్బకు కాంగ్రెస్ కు...

ఆపరేషన్ ఆకర్ష్‌తో తెలంగాణ కాంగ్రెస్ ఉక్కిరిబిక్కిరవుతోంది. లోక్ సభ ఎన్నికలకు మరికొద్ది రోజులే మిగిలి ఉన్న సమయంలో ఆపరేషన్ కమలం దెబ్బకు కాంగ్రెస్ కు ఊహించని షాక్ లు తగులుతున్నాయి. తెలంగాణపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన మార్క్ ఫార్ములాను ఇక్కడ కూడా అమలు చేస్తున్నారు. కాంగ్రెస్ లోని సీయర్లతో పాటు అసంతృప్తులపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దీంతో పలు కాంగ్రెస్ సీయర్ నేతలు హస్తం పార్టీకి హ్యండిస్తున్నారు.

లోక్ సభ ఎన్నికలు సమీపించే కొద్ది తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం క్రమంగా మారిపోతుంది. గత కొద్దిరోజులుగా వరుగా జరుగుతున్న పరిణామాలు తెలంగాణ కాంగ్రెస్ ను కలవరపెడుతున్నాయి. మాజీ మంత్రి డీకే అరుణ ఊహించని విధంగా బీజేపీ గూటికి చేరి, కాంగ్రెస్ కు భారీ షాకిచ్చారు. ఇప్పుడు డీకే అరుణ బాటలోనే మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు, అసంతృప్తులు ఉన్నారనే వాదనలు పార్టీని తీవ్రంగా కలవరపెడుతోంది.

తొలివిడ లోక్ సభ ఎన్నికల్లో నామినేషన్లకు మరో ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో బీజేపీ వ్యూహత్మకంగా పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీలో సీట్లు ఆశించి భంగపడిన నేతలతో పాటు కాంగ్రెస్ నేతల వారసులపై కూడా కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. మరోవైపు, కొందరు గూలబీ నాయకులు కూడా కమలం వైపు చూస్తున్నారనే ప్రచారమూ జరుగుతోంది. ఈ పరిణామాల నేపధ్యంలోనే బీజేపీ అభ్యర్థుల లిస్టు ఆలస్యమవుతోందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా చేరికలు ఉంటాయని బీజేపీ ప్రచారం చేస్తోంది. సుమారు 20మంది సీనియర్‌ కాంగ్రెస్ నేతలు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories