అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ధర్నా

అసెంబ్లీ ముందు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ధర్నా
x
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ అసెంబ్లీ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని...

తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారంటూ అసెంబ్లీ దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అధికార టీఆర్ ఎస్ కొనుగోలు చేస్తుందని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసన తెలుపారు. సీఎం కేసీఆర్ వికృత రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సీఎల్పీ సమావేశం ముగిసిన తర్వాత నల్ల బ్యాడ్జీలు ధరించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ఎదుట ఒక్కసారిగా బైఠాయించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ అవుతుందని ఆరోపించారు. తాజాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేసిందని, వారికి ఎన్ని డబ్బులు ఇచ్చారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. టీఆర్ ఎస్ కు 99 ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంటే మండలికి ఐదో అభ్యర్థిని ఎందుకు నిలబెట్టిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శించారు. టీఆర్ ఎస్ లో చేరనున్న పినపాక, అసిఫాబాద్ ఎమ్మెల్యేలను వారి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీస్తారని చెప్పారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories